పాక్‌ను పొగిడి.. మోడీని విమర్శించిన శశిథరూర్: భగ్గుమంటున్న బీజేపీ

By Siva KodatiFirst Published Oct 18, 2020, 6:41 PM IST
Highlights

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరోనా నియంత్రణ విషయంలో భారత్‌ కంటే పాకిస్తాన్‌ ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపట్టిందని ప్రశంసించడంతో కోరి తలనొప్పులు తెచ్చుకున్నారు. 

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరోనా నియంత్రణ విషయంలో భారత్‌ కంటే పాకిస్తాన్‌ ప్రభుత్వం మెరుగైన చర్యలను చేపట్టిందని ప్రశంసించడంతో కోరి తలనొప్పులు తెచ్చుకున్నారు.

శనివారం ఆల్‌లైన్‌ ద్వారా నిర్వహించిన లాహోర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో పాల్గొన్న శశిథరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌పై మోడీ మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యహరించారని థరూర్ విమర్శించారు.

ప్రధాని వ్యవహరించిన తీరు సరైనది కాదని, ఆయన చర్యల కారణంగా దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని ఆరోపించారు. కరోనాపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తొలి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారని శశిథరూర్ విమర్శించారు.

Also Read:భారతీయులకు గుడ్‌న్యూస్: ఫిబ్రవరికి కరోనా ఖతం.. కేంద్ర కమిటీ ప్రకటన

ఆయన మాటలను వినిఉంటే ఈ రోజు దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. 

ఇదే సమయంలో కరోనాను అరికట్టడంలో భారత ప్రభుత్వం కంటే పాకిస్తాన్‌ ఎంతో పరిణితితో వ్యవహరించిందని థరూర్ ప్రశంసించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వంలో దేశంలోని ముస్లింలకు అభద్రతా భావానికి లోనవుతున్నారని విమర్శించారు.

అయితే థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రశంసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

సరిహద్దుల్లో భారత జవాన్లపై కాల్పులకు తెగబతున్న శత్రుదేశానికి మద్దతు తెలపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‌ దేశ ప్రజలకు, ప్రధాని మోదీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

click me!