మహిళా ఎంపీలతో సెల్ఫీ.. క్షమాపణలు చెప్పిన శశీథరూర్..

By AN TeluguFirst Published Nov 30, 2021, 10:20 AM IST
Highlights

సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ మొదటి రోజు సమావేశాలకు హాజరయ్యే ముందు థరూర్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తమిజాచి తంగపాండియన్, మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ రూహీ, జ్యోతిమణిలతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సోమవారంనాటి తన ట్వీట్ మీద క్షమాపణలు చెప్పారు. నవంబర్ 29, 2021నాడు శశి థరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. "Lok Sabha పని చేయడానికి అంత ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు?" అని కామెంట్ చేశారు. దీనిమీద మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు Shashi Tharoorపై "సెక్సిజం" ఆరోపణలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనికి శశిథరూర్ క్షమాపణలు చెప్పారు. 

ఈ తిరువనంతపురం ఎంపీ ఈ ట్వీట్ మీద తనను తాను సమర్థించుకుంటూ, "ఈ మొత్తం సెల్ఫీ విషయం" అంతా women MPల చొరవతోనే జరిగిందని’.. అదంతా గుడ్ హ్యూమర్ సంభాషణగా మొదలయ్యిందని అలాగే ముగిసిందని చెప్పారు. అంతేకాదు ‘మహిళా ఎంపీలంగా అదే స్ఫూర్తితో ట్వీట్ చేయమని నన్ను కోరారు" అని అన్నారు.

సోమవారం Winter Session of the Parliament మొదలైన సంగతి తెలిసిందే. ఈ మొదటి రోజు సమావేశాలకు హాజరయ్యే ముందు థరూర్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తమిజాచి తంగపాండియన్, మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్ రూహీ, జ్యోతిమణిలతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు.

దీనికి కామెంట్ గా "లోక్‌సభ పని చేయడానికి ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు? ఈ ఉదయం నా తోటి ఆరుగురి ఎంపీలతో ఇలా" అని రాసుకొచ్చారు అయితే ఇది "sexism", "objectification" అని చాలా మంది థరూర్ పై ఆరోపణలు చేయడంతో వివాదం చెలరేగింది.

శశి థరూర్ పార్లమెంట్‌, రాజకీయాల్లో మహిళల సేవలను ఆకర్షణీయ వస్తువులుగా చేసి కించపరుస్తున్నారని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఇలా చెప్పడం ద్వారా "పార్లమెంటులో మహిళలను ఆక్షేపించడం ఆపండి" అని ఆమె అన్నారు.

అందమైన ఎంపీలతో.. శశిథరూర్ సెల్ఫీ.. పెద్ద ఉమనైజర్ అంటూ ట్రోల్స్..!

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా  కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డారు. దేశంలో ఏ మహిళ తన రూపానికి మాత్రమే పరిమితం కాకూడదని అన్నారు. "మిస్టర్ థరూర్ చేసిన ఈ పనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇది థరూర్ కావాలని చేసి ఉండకపోవచ్చు.. అనుకోకుండా, ఇలా అవుతుందని ఊహించకుండా చేసిన ప్రయత్నమని నేను భావిస్తున్నాను. కానీ వాస్తవానికి వస్తే దేశ నిర్మాణ ప్రక్రియలో గొప్పగా దోహదపడే మన మహిళా ఎంపీల గౌరవాన్ని అతను తగ్గించాడు. కేవలం రూపానికి మాత్రమే పరిమితం చేశాడు” అని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. 

ఇది ఇలా ఎదురుతిరుగుతుందని తెలియని థరూర్.. దీంతో షాక్ అయ్యారు.. ఈ ఎదురుదెబ్బ తర్వాత, థరూర్ క్షమాపణలు చెప్పాడు. "కొంతమందిని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి, అయితే నేను వీరితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. అంతే." అని చెప్పుకొచ్చారు. 

TMC ఎంపీ మౌహువా మొయిత్రా  థరూర్‌ను సమర్థించారు. "వ్యవసాయ చట్టం రద్దుపై చర్చను అనుమతించకూడదని, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చాలనే శశీథరూర్ ట్వీట్ ను ఇంతగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా పనికిరాని విషయంపై దాడి చేయడంలో ఆశ్చర్యం లేదు" అని అన్నారు.

click me!