గాంధీ జయంతి రోజున.. బాపూ పుట్టిన గడ్డ నుంచి భారత్ జోడో యాత్ర -2

Siva Kodati |  
Published : Aug 24, 2023, 03:28 PM IST
గాంధీ జయంతి రోజున.. బాపూ పుట్టిన గడ్డ నుంచి భారత్ జోడో యాత్ర -2

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు . అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రెండో విడత యాత్ర మొదలుకానుంది. 

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి మేఘాలయా వరకు యాత్ర కొనసాగనుంది. గాంధీ పుట్టిన నేల నుంచి, గాంధీ జయంతి రోజే యాత్ర మొదలు కానుంది. 2024 జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత యాత్ర ముగియనుంది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా విస్త్రత స్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

తొలిదశ యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4 వేల కిలోమీటర్లు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో నడిచారు. గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 3,970 కిలో మీట‌ర్లు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేసి 130 రోజులకు పైగా కొనసాగిన తర్వాత జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. 

ALso Read: Congress: గుజ‌రాత్ నుంచి మేఘాల‌య వ‌ర‌కు రాహుల్ గాంధీ 'భార‌త్ జోడో యాత్ర‌-2'

కాగా, భార‌త్ జోడో యాత్ర ముగిసిన రెండు నెలలకే రాహుల్ గాంధీ.. 'మోడీ' ఇంటిపేరు వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే, లోక్ సభ ఎంపీ పదవికి కూడా అనర్హత వేటు పడింది. అయితే గత వారం సుప్రీంకోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించడంతో సోమవారం ఆయన తిరిగి లోక్ సభ ఎంపీగా కొన‌సాగుతార‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అందుకే దీక్ష విరమిస్తున్నా: Sonam Wangchuck after breaking hunger strike | Asianet News Telugu
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ వెనుక ఏం జరిగింది? కేంద్రం ఇచ్చిన బిగ్ ఆఫర్ ఇదేనా?