ఢిల్లీలో కలకలం.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఇంటి గోడను ఢీకొట్టిన క్యాబ్, పోలీసుల అదుపులో డ్రైవర్

Siva Kodati |  
Published : Aug 24, 2023, 02:24 PM IST
ఢిల్లీలో కలకలం.. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఇంటి గోడను ఢీకొట్టిన క్యాబ్, పోలీసుల అదుపులో డ్రైవర్

సారాంశం

ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం గోడను బుధవారం ఓ క్యాబ్ డ్రైవర్ తన వాహనంతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హర్యానాలోని నుహ్‌కు చెందిన డ్రైవర్‌ను పట్టుకున్నారు.

ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అధికారిక నివాసం గోడను బుధవారం ఓ క్యాబ్ డ్రైవర్ తన వాహనంతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం థాటికి గోడలో కొంత భాగం కూలిపోయి, ఆ ప్రాంతంలో రంధ్రం ఏర్పడిందని చెప్పారు. కృష్ణ మీనన్ మార్గ్‌లో వెళ్తుండగా రహీమ్ ఖాన్ అనే క్యాబ్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి దగ్గరలోని కిరణ్ రిజిజు ఇంటి గోడను ఢీకొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది హర్యానాలోని నుహ్‌కు చెందిన డ్రైవర్‌ను పట్టుకున్నారు. విచారణ సందర్భగా.. తన క్యాబ్‌ను బస్సు ఢీకొట్టిందని.. దీంతో తాను కేంద్ర మంత్రి ఇంటి గోడను ఢీకొట్టినట్లు రహీమ్ చెప్పాడు. ఘటన జరిగిన సమయంలో రహీమ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నుహ్‌కు వెళ్తున్నాడు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?