కాసేపట్లో రాహుల్ కీలక సమావేశం.. పీసీసీ చీఫ్‌లు, ఏఐసీసీ ఇన్‌ఛార్జులకు పిలుపు

By Siva KodatiFirst Published Jun 22, 2022, 4:44 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జులు, పీసీసీ చీఫ్‌లతో ఆయన భేటీ కానున్నారు. ఈడీ విచారణ, అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో రాహుల్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జులు, పీసీసీ చీఫ్‌లతో ఆయన భేటీ కానున్నారు. అంతకుముందు ఈడీ విచారణ (ed inquiry) పేరుతో తనను వేధించాలనుకున్నారని కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) మండిపడ్డారు. కానీ మోడీ (narendra modi) ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరలేదని.. కాంగ్రెస్ నేతలన్ని ఎవరూ భయపెట్టలేరని, అణగదొక్కలేరని రాహుల్ స్పష్టం చేశారు. తనను విచారించిన అధికారికి ఈ విషయం అర్ధమైపోయిందని.. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాడుతోందని ఆయన పేర్కొన్నారు. సత్యానికీ సహనం వుంటుందని.. అబద్ధం అలసిపోతుందని, సత్యం ఎప్పటికీ అలసిపోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

మరోవైపు.. నేష‌న‌ల్ హెరాల్డ్-మ‌నీలాండ‌రింగ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ‌రుస‌గా విచార‌ణ‌కు పిలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్.. బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆరోపించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం, నేషనల్ హెరాల్డ్ మనీ లాండ‌రింగ్ కేసు పై విచారణ సంస్థ ఐదో రోజు ప్రశ్నిస్తున్న పార్టీ అధినేత రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం సత్యాగ్రహం దీక్ష‌ను చేపట్టింది.

ALso Read:విచారణకు రాలేను.. రెండ్రోజులు వాయిదా వేయండి, ఈడీకి సోనియా గాంధీ లేఖ

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో సహా నిరసన నాయకులు జంతర్ మంతర్‌కు మార్చ్‌ను ప్రకటించారు. అయితే అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇచ్చారని, అయితే మార్చ్ చేయడానికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు. బఘెల్, మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ కార్యాలయం వెలుపల రోడ్డుపై కూర్చున్నారు. ప్రజలను మోసం చేయడానికి ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారిగా ముసుగు వేసుకుంటున్న బీజేపీ నాయకుల‌ను ఫాసిస్టులుగా గెహ్లాట్ అభివర్ణించారు.

click me!