వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే... కాపాడిన యువకులు

Arun Kumar P   | Asianet News
Published : Jul 31, 2020, 11:13 AM IST
వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే... కాపాడిన యువకులు

సారాంశం

వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని దాటే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రమాదానికి గురయిన సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. 

ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నారు. ఇలా వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని దాటే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆయన వెంటవున్న కార్యకర్తలు, స్థానిక యువకులు అతన్ని కాపాడటంతో తృటిలో ప్రమాదం తప్పింది. 

పితోర్‌గడ్ లోని ధార్చులా ప్రాంతంలో పర్యటిస్తూ ఎమ్మెల్యే హరీష్ ఓ వాగును దాటుతూ కాలుజారి ప్రవాహంలో పడ్డారు. నీటి ఉదృతికి అతడు కొట్టుకుపోతుండగా అక్కడే వున్న కొందరు యువకులు ఆయనను కాపాడారు. దీంలో పెను ప్రమాదం తప్పింది. 

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్పంగా గాయాలయ్యాయి. వాగు దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహవేగం పెరగడంతో ఎమ్మెల్యే హరీష్ నీటిలో పడిపోయారని అక్కడున్నవారు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా వరద సంబవించడంతో ప్రజలను పరామర్శించడానికి వెళ్లగా ఎమ్మెల్యే ఈ ప్రమాదానికి గురయ్యారు. 

ఎమ్మెల్యే నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి  చక్కర్లు కొడుతోంది. 

PREV
click me!

Recommended Stories

ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu