కరోనా మరణాల్లో ఐదో స్థానంలో ఇండియా: 16 లక్షలు దాటిన కేసులు

By narsimha lode  |  First Published Jul 31, 2020, 10:17 AM IST

దేశంలలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో అత్యదిక కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 55 వేల కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 16,38,870కి చేరుకొంది.


న్యూఢిల్లీ: దేశంలలో కరోనా మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో అత్యదిక కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 55 వేల కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 16,38,870కి చేరుకొంది.

దేశంలో 6.42 లక్షల శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివవరకు ఒక్క రోజులో పరీక్షించిన శాంపిల్స్ లో ఇదే అత్యధికం. మూడు రోజుల వ్యవధిలోనే 15 లక్షలను దాటి 16 లక్షలకు కరోనా కేసులు చేరుకొన్నాయి.

Latest Videos

undefined

also read:24 గంటల్లో 52 వేలు దాటిన కరోనా కేసులు: మరణాల్లో ఐదో స్థానానికి చేరువలో ఇండియా

వరుసగా రెండో రోజున దేశంలో కరోనా కేసులు 50 వేల కేసులను దాటాయి. గురువారం నాడు 52,123 కేసులు రికార్డైతే శుక్రవారం నాడు 55,078  కేసులు నమోదయ్యాయి.24 గంటల వ్యవధిలో కరోనాతో దేశంలో 779 మంది మరణించారు. దీంతో దేశంలో 35,747కి కరోనా మృతుల సంఖ్య చేరుకొంది.

కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 10 లక్షల 57 వేల మంది కోలుకొన్నారు. ఇంకా 5 లక్షల 45 వేల యాక్టివ్ కేసులున్నాయి.  కరోనా సోకిన రోగుల్లో 64.54 శాతం మంది కోలుకొన్నారు.

కరోనా మరణాల్లో ఇండియా మరో స్థానానికి ఎగబాకింది. ఇటలీనుండి తోసివేసి ఐదో స్థానానికి భారత్ చేరింది. కరోనా మరణాల్లో ఇండియా ఐదో స్థానానికి చేరుకొంది. అమెరికాలో ఇప్పటివరకు 1,52,040 మంది, బ్రెజిల్ లో 91,263 మంది, బ్రిటన్ లో 46,084 మంది, మెక్సికో లో 46 వేలు, భారత్ లో 35,747 మంది కరోనాతో మరణించారు.  ఇటలీలో 35,132 మంది మరణించారు.


 

click me!