రక్షాబందన్: మోడీకి రాఖీ పంపిన పాకిస్తాన్ సోదరి

Published : Jul 31, 2020, 10:40 AM IST
రక్షాబందన్: మోడీకి రాఖీ పంపిన పాకిస్తాన్ సోదరి

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ కు చెందిన మహిళ కమర్ మోహిసిన్ షేక్ ఈ ఏడాది కూడ రాఖీ పంపారు. గత 25 ఏళ్ల నుండి క్రమం తప్పకుండా మోడీకి ఆమె రాఖీలు పంపుతున్నారు.   


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్ కు చెందిన మహిళ కమర్ మోహిసిన్ షేక్ ఈ ఏడాది కూడ రాఖీ పంపారు. గత 25 ఏళ్ల నుండి క్రమం తప్పకుండా మోడీకి ఆమె రాఖీలు పంపుతున్నారు. 

ఆగష్టు 3వ తేదీన రాఖీ పర్వదినం. ఈ పండుగను పురస్కరించుకొని కమర్ పోస్టులో మోడీకీ రాఖీని పంపారు. ఆయురారోగ్యాలతో మోడీ వందేళ్లు జీవించాలని ప్రార్ధిస్తున్నట్టుగా ఆమె తెలిపారు.

ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న సమయం నుండి తాను మోడీకి రాఖీ కడుతున్నట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు.  మోడీ పిలిస్తే తాను ఢిల్లీకి వెళ్తానని ఆమె మీడియాకు చెప్పారు. కమర్ భర్త మొహిసిన్, కొడుకు సుఫీయాన్ కూడ మోడీని అభిమానిస్తారని ఆమె చెప్పారు. 

మోడీ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుంటారని ఆమె ప్రశంసించారు. కానీ ఆయన నిరాడంబరంగా కన్పిస్తారని ఆమె తెలిపారు. తనతో పాటు తన ఇద్దరు చెల్లెళ్లు కూడ మోడీకి రాఖీ కట్టారని కోరుకొంటున్నట్టుగా ఆమె చెప్పారు.

పాకిస్తాన్ కు చెందిన మకర్ మొహిసిన్ ఇండియాకు చెందిన మొహిసిన్ కు వివాహం చేసుకొంది. దీంతో ఆమె ఇండియాలోనే ఉంటుంది. కమర్ అహ్మదాబాద్ లో నివాసం ఉంటుంది. మోడీని తాను ఆశీర్వాదం కోరుకొంటున్నట్టుగా ఆమె చెప్పారు.తన పట్టుదల, శ్రమతో మోడీ ప్రధాని స్థాయి వరకు ఎదిగారని ఆమె ప్రశంసలతో ముంచెత్తారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu