స్వైన్‌ఫ్లూ నుంచి కోలుకున్న అమిత్‌షా.. ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్

sivanagaprasad kodati |  
Published : Jan 20, 2019, 01:03 PM IST
స్వైన్‌ఫ్లూ నుంచి కోలుకున్న అమిత్‌షా.. ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్

సారాంశం

స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోలుకున్నారు. దీంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కోలుకున్నారు. దీంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గత వారం స్వైన్ లక్షణాలతో ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులెరియా పర్యవేక్షణలో చికిత్స అందించారు.

ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అయితే ‘‘ తాను స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని’’ అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా డిశ్చార్జ్ అనంతరం అమిత్ షా ఎయిమ్స్ నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్