రాహుల్ పరిణితి చెందారు: బీజేపీ మహిళా ఎంపీ ప్రసంశలు

By Nagaraju TFirst Published Jan 20, 2019, 3:06 PM IST
Highlights

బీజేపీ మహిళా ఎంపీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసల కురిపించారు.  రాహుల్‌లో ఇటీవల కొంత పరిణితి కనిపిస్తోందని బీజేపీ మహిళా ఎంపీ సరోజ్‌ పాండే కితాబిచ్చారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన పాండే గతంలోనూ రాహుల్‌కు మందబుద్ధి ఉందని కామెంట్ చేశారు. 
 

డెహ్రాడూన్‌ : బీజేపీ మహిళా ఎంపీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసల కురిపించారు.  రాహుల్‌లో ఇటీవల కొంత పరిణితి కనిపిస్తోందని బీజేపీ మహిళా ఎంపీ సరోజ్‌ పాండే కితాబిచ్చారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన పాండే గతంలోనూ రాహుల్‌కు మందబుద్ధి ఉందని కామెంట్ చేశారు. 

రాహుల్‌ గాంధీ పార్లమెంట్ సమావేశాల్లోనూ రాజకీయ వ్యవహారాల్లోనూ అతను అనుసరిస్తున్న విధానాలు, వేస్తున్న ఎత్తుగడలను ఆమె అభినందించారు. వెనువెంటనే కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గతంలో వ్యాపం స్కాంను రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ భుజాలకెత్తుకుందని, అది సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో రాఫేల్‌ స్కాంను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. 

ఇకపోతే కోల్‌కతాలో విపక్షాల ఐక్యతా ర్యాలీపైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సొంత రాష్ట్రం బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని మమతా బెనర్జీ విపక్షాల ర్యాలీకి నేతృత్వం వహించడం విస్మయం కలిగిస్తోందని విమర్శించారు. 

బెంగాల్‌లో విపక్షాలను అణిచివేస్తున్న మమతా సమక్షంలో విపక్షాలన్నీ మోదీపై పోరాడతామని ప్రకటించడం అవివేకమని ధ్వజమెత్తారు. బీజేపీ సత్తా ఏపాటిదో ర్యాలీలో పాల్గొన్న నేతలను చూస్తే అర్థమవుతుందని ఎంపీ సరోజ్ పాండే అభిప్రాయపడ్డారు. 

click me!