టూల్ కిట్ కేసు : ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు.. త్వరలో బీజేపీ నేతలకు...

By AN TeluguFirst Published May 25, 2021, 4:53 PM IST
Highlights

ఒకవైపు దేశం కొవిడ్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు రాజకీయ కుమ్ములాటలో మునిగిపోయాయి. తాజాగా తెరపైకి వచ్చిన టూల్ కిట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారంగా మారిపోయింది.

ఒకవైపు దేశం కొవిడ్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు రాజకీయ కుమ్ములాటలో మునిగిపోయాయి. తాజాగా తెరపైకి వచ్చిన టూల్ కిట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారంగా మారిపోయింది.

ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దేశ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం పట్టించుకోకుండా ఇరు పార్టీలు పరస్పరం కుమ్ములాడుకుంటున్నాయి.

కాగా, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలకు ఢిల్లీ పోలీసు విభాగం ప్రత్యేక సెల్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతి రోహన్ గుప్త, పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడలకు ఢిల్లీ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.
 
ఇక భారతీయ జనతా పార్టీ నేత సంబిత్ పాత్రకు కూడా త్వరలో నోటీసులు అందనున్నట్లు సమాచారం. కోవిడ్ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కార్ పై, ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని... ప్రభుత్వం, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని దేశ ప్రతిష్టను, ప్రధాని మోడీ గౌరవాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంస రచనకు పాల్పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దీనిపై బిజెపి గణమంతా వంత పాడటం తో కాంగ్రెస్, బిజెపిల మధ్య రాజకీయ అగ్గి రాజుకుంది.

click me!