చైనాతో ముప్పు.. రక్షణ రంగానికి కేటాయింపులేవి: బడ్జెట్‌పై చిదంబరం విమర్శలు

By Siva KodatiFirst Published Feb 1, 2021, 5:42 PM IST
Highlights

కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శల దాడి చేస్తున్నాయి.

కేంద్ర బడ్జెట్ 2021-22ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ సహా ఎన్డీఏ పక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శల దాడి చేస్తున్నాయి.

తాజాగా మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం బడ్జెట్‌పై విమర్శలు చేశారు. బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచలేదని మండిపడ్డారు.

చైనా నుంచి ముప్పు ఎదురవుతుంటే రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిని అవసరం లేదా అని చిదంబరం ప్రశ్నించారు. ప్రజారోగ్యానికి కేటాయింపులన్నీ లెక్కల గారడీలేనని... కేవలం రూ.4 వేల కోట్లే రక్షణ రంగానికి కేటాయించారని ఆయన మండిపడ్డారు.

Also Read:భారత్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది: బడ్జెట్‌పై మోడీ వ్యాఖ్యలు

ఏనాడైనా ఇంత తక్కువ స్థాయిలో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచారా అని చిదంబరం నిలదీశారు. రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారో చెప్పలేదన్నారు.

అంతకుముందు వార్షిక బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామన్న హామీని మర్చిపోయారని మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. ప్రజలను విస్మరించిన మోదీ సర్కారు దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారుల పరం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

click me!