మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది: మల్లికార్జున్ ఖర్గే

By Sumanth KanukulaFirst Published Jun 23, 2022, 5:04 PM IST
Highlights

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ సీనియర్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. మహారాష్ట్రలో వారి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం.. అక్కడి సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నందుకు బీజేపీ, కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని కాంగ్రెస్ సీనియర్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. మహారాష్ట్రలో వారి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం.. అక్కడి సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నందుకు బీజేపీ, కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం కూడా ఇలా చేస్తున్నారని విమర్శించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని తామంతా (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) బలపరుస్తామని చెప్పదలచుకున్నానని అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌.. రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న మైనారిటీలోకి తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా వ్యవహరించిందో అందరికి తెలిసిందేనని అన్నారు. 

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా సంజయ్ రౌత్ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. కొద్దిసేపటి క్రితం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాదీ (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి) నుంచి తప్పుకోవడంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందరూ తిరిగి ముంబయికి వచ్చేయాలని కోరారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన కాంగ్రెస్.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో కాంగ్రెస్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి హెచ్‌కే పాటిల్, బాలాసాహెబ్ థోరట్, నానా పటోలే, అశోక్ చవాన్ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. 

మరోవైపు Nationalist Congress Party ఇది వరకే తమ వైఖరిని వెల్లడించింది. శివసేన ప్రభుత్వం కొనసాగితే అధికారపక్షంలో కూర్చుంటామని లేదంటే.. ప్రతిపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారు. అయితే చివరి వరకు ఉద్దవ్ ఠాక్రేకు అండగా ఉంటామని చెప్పారు.  ‘‘మహా వికాస్ అఘాడి మహారాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం స్థాపించబడిన ప్రభుత్వం. మేము చివరివరకు ఉద్ధవ్‌ ఠాక్రేకు అండగా ఉంటాము. బాలాసాహెబ్ ఠాక్రే ఆలోచనలను మోసం చేసే విధంగా నిజమైన శివసైనికులెవరూ ప్రవర్తించరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని జయంత్ పాటిల్ ట్వీట్ చేశారు. 

click me!