ఆప్ ఎమ్మెల్యేకు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపులు.. ‘డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాం’

By Mahesh KFirst Published Jun 23, 2022, 4:53 PM IST
Highlights

దేశ రాజధానిలో గ్యాంగ్‌స్టర్ పేరిట ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. పెద్ద మొత్తంలో నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు కాల్స్ చేశారు. అడిగినన్ని డబ్బులు అందించకుంటే చంపేస్తామనీ హెచ్చరించినట్టు పోలీసులు వివరించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో గ్యాంగ్‌స్టర్‌ల వార్తలు పెరిగిపోతున్నాయి. పంజాబ్ పాప్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యతో గ్యాంగ్‌స్టర్‌ల గురించిన చర్చ మొదలైంది. తాజాగా, మరోసారి ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్‌లకు చెందిన ఆగడాలు రిపోర్ట్ అయ్యాయి. దేశరాజధానిలో ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకే బెదిరింపులు ఇచ్చి సంచలనం సృష్టించారు. ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝాకు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

ఉత్తర ఢిల్లీలో సంత్ నగర్ బురారీ రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా‌కు ఇటీవలే వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పెద్ద మొత్తంలో డబ్బులు అందించాలని డిమాండ్ చేస్తూ ఆ కాల్స్ వచ్చాయి. డిమాండ్ చేసినన్ని డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామనీ బెదిరించినట్టు పోలీసులు గురువారం వివరించారు.

ఇండియాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడైన నీరజ్ బావనా పేరిట ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝాను బెదిరించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు కూడా చేస్తున్నట్టు వివరించారు.

కాాగా, పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తు పురోగతి సాధించింది. ఈ కేసులో నలుగురు షూటర్లను గుర్తించడానికి పెట్రోల్ పంప్ రశీదు కీలకంగా మారాయి. సిద్దూ మూసేవాలా హత్యకు ఉపయోగించిన కారులో లభించిన క్లూలో ఫ్యూయల్ రిసీట్ ఒకటి. ఈ రశీదు ద్వారా సిద్దూ మూసేవాలాను హతమార్చిన నలుగురు షూటర్లను పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది.

click me!