
Congress leader Kanhaiya Kumar: మహారాష్ట్రకు చేరుకున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర తన లక్ష్యాలను నెరవేర్చడంలో విజయవంతమైందని పాదయాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు భారత్ యాత్రికుడైన కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ అన్నారు. ఆదివారం నాటికి భారత్ జోడో యాత్ర 66వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్రలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో క్రమంలో కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ప్రతిష్టను దిగజార్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. అయితే, వారు ఎంత చేసినా.. ప్రజలు ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి వాస్తవాలను ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోగో యాత్ర ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయని అన్నారు. ఆయన పరువు తీసే ప్రయత్నం జరిగిందని ఆరోపించిన ఆయన.. భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలు రాహుల్ గాంధీ నిజమైన చిత్రాన్ని చూస్తారని అన్నారు. రాహుల్ గాంధీ గురించి సోషల్ మీడియాలో లేదా చర్చలో సృష్టించడానికి ప్రయత్నించిన ఇమేజ్‌లా కాకుండా, ఇప్పుడు ప్రజలందరికీ కనిపిస్తుందని కన్హయ్య కుమార్ అన్నారు. అదే సమయంలో, భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ యాత్ర అనుకున్నదానికంటే ఎక్కువగా ఈ యాత్ర లక్ష్యం నెరవేరుతోందని అన్నారు.
"ఈ యాత్ర ప్రారంభమైనప్పుడు జనాలు వస్తారా అన్నదే చాలా మంది ప్రశ్న. ఇంత నడవగలమా? నఇత్యం 25 కిలో మీటర్ల నడవటం ఎలా? అనే సందేహాలు ఉండేవి. అయితే ఈ ప్రయాణం 60 రోజులు ఎలా గడిచిందో తెలియలేదు. దేశానికి అలాంటి పర్యటన అవసరం. యాత్ర గురించి చెప్పాల్సినంత ప్రచారం, టీవీల్లో చూపించలేదు. ప్రచారం చేయకపోయి ఉండొచ్చు కానీ, యాత్ర జరుగుతున్న సంగతి దేశ ప్రజలకు తెలుసు. " మనిషి కాళ్ళతో నడవడు, కానీ ప్రేరణతో నడవగలడని మేము గుర్తుంచుకున్నాము. ఈ యాత్ర ద్వారా ఇది నిజమని రుజువైంది" అని అన్నారు.
భారత్ జోడో యాత్రలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఉద్యోగాలు వంటి అనేక అంశాలపై చర్చించినట్లు కన్హయ్య కుమార్ తెలిపారు. ఇప్పుడు భారత్ జోడో యాత్ర రెండో విడత పూర్తి కావాల్సి ఉంది. "దేశ ప్రజానీకం ప్రభుత్వం నుండి సమాధానాలు కోరవలసి ఉంది. ఈ దేశంలో లక్షలాది మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం ప్రతిరోజూ నడిచి వెళుతున్నారు. ఇది ఒక తపస్సు.. ఈ తపస్సు అంతరార్థాన్ని అర్థం చేసుకోవడానికి మేము ఈ ప్రయాణం చేస్తున్నాము. దేశ యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి" అని కన్హయ్య కుమార్ అన్నారు.
భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి 3500 కిలో మీటర్ల ప్రయాణం సాగించే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగుతున్న భారత్ జోడో యాత్ర.. 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 150 రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కవర్ చేసింది. జనవరి 2023 నాటికి జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగియనుంది.