డీఎంకే చీఫ్ స్టాలిన్ కు సోనియా ఆహ్వానం: 23న జరిగే మీటింగ్ హాజరుకావాలని పిలుపు

By Nagaraju penumalaFirst Published May 16, 2019, 12:26 PM IST
Highlights

 ఇప్పటికే సోనియాగాంధీ యూపీఏ మద్దతుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరిన ఆమె పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. తాజాగా గురువారం తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే చీఫ్ స్టాలిన్ కు ఆహ్వానం పలికనట్లు తెలుస్తోంది. 

తమిళనాడు: ఎన్నికల ఫలితాలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ దేశరాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. 

ఈసారి ఏర్పడబోయే కేంద్రప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీలు కీ రోల్ పోషించబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలకు గాలం వేసే పనిలో పడ్డాయి జాతీయ పార్టీలు. 

ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేరుగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని రంగంలోకి దించింది. ఇప్పటికే సోనియాగాంధీ యూపీఏ మద్దతుకు వ్యూహాలు రచిస్తున్నారు.

 ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరిన ఆమె పలు పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. తాజాగా గురువారం తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే చీఫ్ స్టాలిన్ కు ఆహ్వానం పలికనట్లు తెలుస్తోంది. 

స్టాలిన్ కు సోనియాగాంధీ నుంచి ఆహ్వానం అందినట్లు డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. ఈనెల 23న జరిగే ప్రతిపక్షాల భేటీకి హాజరు కావాలని సోనియాగాంధీ నుంచి పిలుపు వచ్చినట్లు ప్రకటించింది.  

ఇకపోతే డీఎంకే చీఫ్ స్టాలిన్ యూపీఏ కూటమికి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. యూపీఏ కూటమికి మద్దతుగానే ఎన్నికల బరిలో నిలిచారు. అంతేకాదు రాహుల్ గాంధీయే తమ ప్రధాని అభ్యర్థి అంటూ స్పష్టం చేసిన తొలినేత కూడా స్టాలిన్ కావడం విశేషం. 
 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి

click me!