నిర్మలపై ట్వీట్.. ఆడుకున్న నెటిజన్లు: ట్విట్టర్‌ ఖాతాను డిలీట్ చేసిన రమ్య

By Siva KodatiFirst Published Jun 2, 2019, 12:45 PM IST
Highlights

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఒక ఆట ఆడుకోవడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఛైర్మన్, సినీనటి రమ్య తన ట్వీట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. 

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఒక ఆట ఆడుకోవడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఛైర్మన్, సినీనటి రమ్య తన ట్వీట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..  ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్‌లో నిర్మలా సీతారామన్‌కు కీలకమైన ఆర్ధిక శాఖ దక్కడంతో ఆమె దేశంలో తొలి ఆర్ధిక మంత్రిగా రికార్డుల్లోకెక్కారు.

దీంతో దేశవ్యాప్తంగా నిర్మలకు ప్రశంసలు అందుతున్నాయి. రమ్య కూడా నిర్మలకు అభినందనలు తెలిపారు. ‘‘ 1970లలో ఇందిరాగాంధీజీ ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి మహిళలను గర్వపడేలా చేశారు.

ఇప్పుడు మీరు కూడా ఆ శాఖను చేపట్టినందుకు అభినందనలు. కానీ జీడీపీ అంత గొప్పగా ఏం లేదు, అయినప్పటికీ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మీ వంతుగా తప్పక కృషి చేస్తారని తెలుసు.

మీకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని రమ్య ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వీటర్‌లో విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ కామెంట్లకు తట్టుకోలేకపోయిన రమ్య తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. అయితే దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు.. కాగా రమ్యకు ట్విట్టర్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 
 

click me!