బీజేపీలోకి ఫిరాయింపులు .. ఆ ఎమ్మెల్యేలు వేశ్యలు : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 18, 2023, 04:45 PM IST
బీజేపీలోకి ఫిరాయింపులు .. ఆ ఎమ్మెల్యేలు వేశ్యలు : కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

సారాంశం

2019లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా వేశ్యలతో సమానమని వ్యాఖ్యానించారు. 

కర్ణాటక కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆయన వేశ్యలతో పోల్చుకుంటున్నారు. మంగళవారం హోస్పేట్‌లో జరిగిన కార్యక్రమంలో బీకే హరిప్రసాద్ ప్రసంగించారు. 2019లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హోస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కూడా బీజేపీలో చేరిన వారిలో వుండటంతో ఆయనను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తిండి కోసం శరీరాన్ని అమ్ముకునే స్త్రీని వేశ్య అంటారని.. మరి తమను తాము అమ్ముకున్న ఎమ్మెల్యేలను ఏమని పిలుస్తారని హరి ప్రసాద్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హరిప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో పాటు వేశ్యా వృత్తిలో వున్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని.. ఆత్మగౌరవంతో జీవించే మహిళలు, సెక్స్ వర్కర్ కమ్యూనిటీకి గొప్ప గౌరవం వుందన్నారు. తాను అన్న మాటల్లో వేశ్య అన్న పదాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. తన మాటల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్