సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ అండ్ కో అనర్హులు.. వాళ్ల తరపున వాదించొద్దు : న్యాయవాదులకు అజయ్ మాకెన్ విజ్ఞప్తి

Siva Kodati |  
Published : Apr 16, 2023, 08:43 PM IST
సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ అండ్ కో అనర్హులు.. వాళ్ల తరపున వాదించొద్దు : న్యాయవాదులకు అజయ్ మాకెన్ విజ్ఞప్తి

సారాంశం

తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతల తరపున న్యాయస్థానాల్లో వాదించవద్దని న్యాయవాదులను కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్.  

తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్, అతని సహచరులుపై ఎలాంటి సానుభూతి లేదా మద్దతు చూపకూడదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్. లిక్కర్ గేట్, గీగేట్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ అవినీతి మార్గాల ద్వారా సంపాదించిన డబ్బును భారత జాతీయ కాంగ్రెస్ (INC)తో సహా రాజకీయ నాయకులందరూ గుర్తించడం చాలా ముఖ్యమని అజయ్ మాకెన్ అన్నారు. 

అన్నా హజారే ఉద్యమాన్ని అనుసరించి అవినీతిపై పోరాటమే లక్ష్యంగా 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతికి పరిష్కారంగా ప్రతిపక్ష పార్టీలు భావించిన లోక్‌పాల్ బిల్లును అమలు చేస్తామని ఆప్ హామీ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన 40 రోజులకే ఫిబ్రవరి 2014లో తన స్వంత ప్రభుత్వాన్ని రద్దు చేశారని అజయ్ మాకెన్ గుర్తుచేశారు. ఇదే సమయంలో బలమైన లోక్‌పాల్ బిల్లును డిమాండ్ చేశారని తెలిపారు. 

ఇదిలావుండగా.. డిసెంబర్ 2015లో కేజ్రీవాల్ 2014లో ప్రతిపాదించిన అసలు బిల్లుకు చాలా భిన్నంగా లోక్‌పాల్ బిల్లుకు పట్టులేని సంస్కరణను ప్రవేశపెట్టారని అజయ్ మాకెన్ దుయ్యబట్టారు. ఇది కేజ్రీవాల్ నిబద్ధత, ఉద్దేశాలను బహిర్గతం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. తన 40 రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి పునాది వేసిన అసలు బిల్లు నేటికీ అమలు కాలేదన్నారు. 2015 నుండి కేజ్రీవాల్ , అతని పార్టీ బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం ఒత్తిడి చేయడంలో విఫలమయ్యాయి. బదులుగా వారు నిరసనలు, మార్చ్‌లు, పత్యారోపణలకు మాత్రమే పరిమితమయ్యారని అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లు కేజ్రీవాల్‌ను పిలిపించి ఘీగేట్ ఆరోపణలపై దర్యాప్తు చేసి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

కోర్టులో కేజ్రీవాల్‌కు, అతని ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహించడం మానుకోవాలని న్యాయవాదులకు, సీనియర్ వర్కింగ్ కమిటీ సభ్యులకు, స్టీరింగ్ కమిటీ సభ్యులకు అజయ్ మాకెన్ విజ్ఞప్తి చేశారు. కోర్టులో ప్రాతినిథ్యం వహించడం అనేది వారి వృత్తిలో భాగమైనప్పటికీ .. కేజ్రీవాల్, అతని సహచరులకు సాయం చేయడం కాంగ్రెస్ కేడర్‌కు తప్పుడు సందేశాన్ని పంపడమే కాకుండా వారిని గందరగోళానికి గురిచేస్తుందని మాకెన్ అభిప్రాయపడ్డారు. అంతిమంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్లను విభజించి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి లాభిస్తుందని అజయ్ మాకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్