ఈ నెల 18న కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష

Published : Jul 15, 2019, 02:16 PM IST
ఈ నెల 18న కుమారస్వామి ప్రభుత్వానికి బలపరీక్ష

సారాంశం

ఈ నెల 18వ తేదీన అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ చేసుకోనున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ బీజేపీ సోమవారం నాడు  స్పీకర్‌కు నోటీసు ఇచ్చింది

బెంగుళూరు: ఈ నెల 18వ తేదీన అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ చేసుకోనున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ బీజేపీ సోమవారం నాడు  స్పీకర్‌కు నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై ఈ నెల 18వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉంది.

సోమవారం నాడు బీజేపీ సభ్యులు  స్పీకర్ రమేష్ కుమార్ కు  నోటీసు ఇచ్చారు. కుమారస్వామి ప్రభుత్వంపై  అవిశ్వాసం ప్రతిపాదిస్తూ నోటీసు ఇచ్చారు. మరో వైపు తాను అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్దమని ఇదివరకే సీఎం కుమారస్వామి ప్రకటించారు.

అయితే ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో  విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉందని మాజీ సీఎం  సిద్దరామయ్య  ప్రకటించినట్టుగా  ఓ ఇంగ్లీస్ చానెల్ ప్రకటించింది.  అయితే  రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?