స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Published : Jul 15, 2019, 01:17 PM IST
స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ: రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

సారాంశం

స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను  కర్ణాటక సీఎం కుమారస్వామి సోమవారం నాడు కలిశారు.కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

బెంగుళూరు: స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను  కర్ణాటక సీఎం కుమారస్వామి సోమవారం నాడు కలిశారు.కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఇవాళ బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సమావేశం తర్వాత స్పీకర్ రమేష్‌కుమార్ ను సీఎం కుమారస్వామి కలిశారు. నాలుగు రోజుల క్రితం తాను విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానని సీఎం కుమారస్వామి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే విశ్వాస పరీక్షకు సమయం కావాలని కుమారస్వామి అడిగారు.

బలపరీక్షను ఇవాళే చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో  స్పీకర్ రమేష్ కుమార్‌తో సీఎం కుమారస్వామి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారోననేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur