INDIA Bloc: ఇండియా కూటమికి ఆప్ అల్టిమేటం.. కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వడమే ఎక్కువ: ఆప్ స్పష్టీకరణ

By Mahesh K  |  First Published Feb 13, 2024, 3:41 PM IST

ఇండియా కూటమికి ఆప్ అల్టిమేటం జారీ చేసిందా? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వడమే ఎక్కువ.. పొత్తు ధర్మం కోసం ఒక్క సీటు ఇస్తామని తెలిపింది.
 


Congress: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండు సీట్లకు మించి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వమని ఇటీవలే పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూటమి నుంచి తప్పుకుని అన్ని సీట్లలో తామే పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఇదే దారిలో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ వెళ్లుతున్నది. ఢిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లల్లో ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని పేర్కొంది.

ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇవ్వడం కూడా ఎక్కువేనని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ అన్నారు. కానీ, పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క సీటును కాంగ్రెస్‌కు ఇస్తామని, మిగిలిన ఆరు లోక్ సభ సీట్లల్లో ఆప్ పోటీ చేస్తుందని కాంగ్రెస్‌కు ప్రతిపాదించనున్నట్టు వివరించారు.

Latest Videos

undefined

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మంచి ప్రదర్శన చూపింది. అందుకే సీట్ల కేటాయింపులో ఆప్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. కాగా, కాంగ్రెస్‌కు మాత్రం ఢిల్లీలో పలు ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. మళ్లీ కాంగ్రెస్ ఇక్కడ పుంజుకోవాలని చూస్తున్నది.

Also Read : Bengaluru: హెల్మెట్ లేదని బైక్ ఆపితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు.. అధికారులు ఏం చేశారంటే?

‘ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానం కూడా లేదు. ఎంసీడీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 250 సీట్లల్లో 9 సీట్లు గెలుచుకుంది’ అని పాఠక్ వివరించారు. 

ఇండియా కూటమి ప్రాథమిక చర్చల్లో 4 : 3 సీట్ల కేటాయింపు ఫార్ములాను ఢిల్లీ కోసం చర్చించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. అంటే.. కాంగ్రెస్ నాలుగు సీట్లల్లో ఆప్ మూడు సీట్లల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కానీ, ఆ ఫార్ములాపైనా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తున్నది. అందుకే తాజాగా, ఆప్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇస్తామని లేదంటే.. కూటమి నుంచి తప్పుకుంటామనే సంకేతాలను ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది. దీంతో ప్రతిపక్ష శిబిరంలో కలకలం రేగుతున్నది.

click me!