Opposition Unity: ప్రతిపక్షాల సమావేశం వాయిదా.. కాంగ్రెస్ ఏమన్నదో తెలుసా?

By Mahesh KFirst Published Jun 4, 2023, 11:49 PM IST
Highlights

ప్రతిపక్షాలు బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించ తలపెట్టిన సమావేశం జూన్ 12వ తేదీ నుంచి జూన్ 23వ తేదీకి వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ, డీఎంకేలు ఈ భేటీని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసిన తర్వా త ఈ నిర్ణయం తీసుకుంది.
 

న్యూఢిల్లీ: బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర ప్రయత్నాల తర్వాత పాట్నాలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు సమావేశం కావడానికి సముఖత వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీన ప్రతిపక్షాల భారీ సమావేశం ఉంటుందని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ సమావేశం జూన్ 23వ తేదీకి వాయిదా పడింది. ఈ సమావేశం వాయిదా పడటానికి కాంగ్రెస్, డీఎంకే పార్టీల విజ్ఞప్తులే కారణం. ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్, దాని తమిళనాడు మిత్రపక్షం డీఎంకే విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

రాహుల్ గాంధీ ప్రస్తుతం ఆరు రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన జూన్ 15వ తేదీన తిరిగి ఇండియాకు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆయన తల్లి సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో విదేశానికి వెళ్లారు. బిడ్డ ప్రియాంక గాంధీ వాద్రా ఆమె వెంటే ఉన్నారు. అందుకే ఈ ప్రతిపక్షాల భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

డీఎంకే కూడా ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. జూన్ 12వ తేదీనే రాష్ట్రంలో ఓ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరు కావాల్సి ఉన్నది. 

బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలు జరిపి ఈ సమావేశానికి అందరినీ ఒప్పించగలిగారు. 2024లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ ఒక తాటి మీదికి ఆయన తీసుకువచ్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు.

Also Read: Odisha: బాలాసోర్ రైలు పట్టాలపై ప్రేమ కవితలు.. డైరీలోనే ఆ ప్రేమ శిథిలం

ఈ సమావేశం గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలతో గత నెల సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ తేదీని నిర్ణయించారు.

కాంగ్రెస్‌తో ఉప్పు నిప్పుగా మెలిగిన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్‌లు హస్తం పార్టీ వెంట వస్తున్నారు. నితీశ్ కుమార్ చర్చలతోనే వీరు కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తున్నది.

click me!