అయ్యో ఏంటీ ఈ ఘోరం.. నలుగురు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

By Rajesh KarampooriFirst Published Jun 4, 2023, 10:59 PM IST
Highlights

రాజస్థాన్‌లోని  బార్మర్ జిల్లా మండలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం ఒక తల్లి తన నలుగురు పిల్లలను చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. ఆ తల్లి మొదట తన నలుగురు పిల్లలను ధాన్యం డ్రమ్ములో వేసి దాని మూత మూసివేసిందని చెబుతున్నారు. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఓ కన్నతల్లి తన పేగుబంధాన్ని తెంచుకుంది. తన నలుగురు పిల్లలను తన చేతులతో చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్మర్ జిల్లాలోని మాండ్లీ స్టేషన్ ప్రాంతంలో జెతారామ్ తన భార్య ఊర్మిళ తన నలుగురు పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే.. శనివారం  జేతారామ్ కూలి కోసం బాలేసర్ (జోధ్‌పూర్)కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఊర్మిళ తన పిల్లలు భావన (8), విక్రమ్ (5), విమల (3), మనీషా (2)లను వడ్లు నిల్వ ఉంచే గుమ్మిలలో పెట్టి మూతలు వేసింది.

ఆ తర్వాత ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.ఈ లోగా పిల్లలు గాలి ఆడక చనిపోయారు. సమీపంలో నివసించే వారి బంధువులు సాయంత్రం వరకు ఊర్మిళ, తన పిల్లలు చూడకపోవడంతో.. వారు ఇంటిని సందర్శించారు. అక్కడ వారిని ఊర్మిళ ఉరి వేసుకుని వేలాడుతుండగా..  ఆమె పిల్లలను గుమ్మిలో లాక్ చేసి కనిపించారు. గ్రామస్థులతో పాటు బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను కళ్యాణ్‌పూర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత ఐదేళ్లుగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని మృతురాలి మేనమామ దుర్గారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
సర్కిల్‌ స్టేషన్‌ అధికారి కమలేష్‌ గెహ్లాట్‌ ఘటనపై మాట్లాడుతూ.. ప్రాథమికంగా రిపోర్టు ప్రకారం..భార్యాభర్తల మధ్య విభేదాలకు సంబంధించినదని పోలీసు అధికారి తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

click me!