సోనియా గాంధీకి మాటిచ్చాను.. కర్ణాటక ఫలితాలపై డీకే శివకుమార్ భావోద్వేగం.. సీఎం రేసుపై ఏం చెప్పారంటే.. (వీడియో)

Published : May 13, 2023, 01:36 PM IST
సోనియా గాంధీకి మాటిచ్చాను.. కర్ణాటక ఫలితాలపై డీకే శివకుమార్ భావోద్వేగం.. సీఎం రేసుపై ఏం చెప్పారంటే.. (వీడియో)

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా సాగుతుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ భావోదేగ్వానికి గురయ్యారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా సాగుతుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ భావోదేగ్వానికి గురయ్యారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నాయకులందరిదని తెలిపారు. తమపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టుగా తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ  విజయం కోసం పూర్తిస్థాయిలో కృషి చేశారని చెప్పారు. సిద్ధరామయ్యతో సహా రాష్ట్రంలోని నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని తాను సోనియా గాంధీకి వాగ్దానం చేశానని శివకుమార్ అన్నారు.

‘‘కర్ణాటకను అందజేస్తానని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గేలకు నేను హామీ ఇచ్చాను. సోనియా గాంధీ నన్ను జైలులో కలవడానికి రావడం మర్చిపోలేను’’ అని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇక, సీఎం రేసు‌పై స్పందించిన డీకే శివకుమార్.. తనకంటూ మద్దతుదారులు ఎవరూ లేరని.. మొత్తం కాంగ్రెస్ పార్టీ తనకు సపోర్టుగా ఉందని చెప్పారు. ‘‘కాంగ్రెస్ కార్యాలయమే మా దేవాలయం.. మేము మా తదుపరి దశను కాంగ్రెస్ కార్యాలయంలో నిర్ణయిస్తాము’’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. 

 

ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ  శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. అక్కడ స్వీట్స్ పంపిణీ  చేస్తున్నారు. ‘‘కాంగ్రెస్ ఓటమి నుండి గుణపాఠం నేర్చుకుని నేడు విజయం వైపు పయనిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా అన్నారు. మరోవైపు బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఆఫీసు వద్ద బాణసంచా కాల్చుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu