Assembly Election Results 2023 : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మొదలు కాగానే.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. డోలు వాయిద్యాలతో, శ్రేణుల రాకతో అక్కడంతా సందడిగా ఉంది. ఇప్పుడే స్వీట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
Assembly Election Results 2023 : మధ్యప్రదేశ్, తెలంగాణ, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. ఈ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయం తమదే విజయమని కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాతో ఉంది. దీంతో ఇటు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే అటు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (congress party headquarters in delhi) వెలుపల సంబరాలు ప్రారంభమయ్యాయి.
| Music, dance and celebrations outside the Congress headquarters in Delhi, ahead of the counting of votes for the four-state elections. pic.twitter.com/ex9OmkBwFQ
— ANI (@ANI)ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. లోపలంతా డప్పు చప్పుల్లు,, డ్యాన్సులతో శ్రేణులంతా సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’షేర్ చేసింది.
| 'Ladoos' brought to Congress headquarters in Delhi as the party is all set for election results in Chhattisgarh, Rajasthan, Madhya Pradesh and Telangana pic.twitter.com/XBvUpAOIzM
— ANI (@ANI)
అలాగే లడ్డూలను కూడా రెడీ చేసుకుంటున్నారు. అధికారికంగా ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని పంచుకుంటూ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పుడు వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రంపై పెను ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. దశాబ్దాలుగా తమ రాష్ట్రాల రాజకీయాలు ముడిపడి ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఇవి కీలకంగా మారనున్నాయి.