ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ : రాజీనామా చేయండి.. ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు హైకమాండ్ ఆదేశం

Siva Kodati |  
Published : Mar 15, 2022, 07:32 PM IST
ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ : రాజీనామా చేయండి.. ఆ ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లకు హైకమాండ్ ఆదేశం

సారాంశం

సీడబ్ల్యూసీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం యాక్షన్‌లోకి దిగింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది.   

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (five state elections) ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఓటమి పాలైన 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. దీనితో పాటు మరిన్ని చర్యలకు  సన్నద్ధమౌతోంది కాంగ్రెస్ అధినాయకత్వం. 

కాగా.. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌గా భావించిన.. ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు ముగిశాయి. ఈ ఎన్నిక‌ల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించగా.. పంజాబ్ లో మాత్రం ఆప్ త‌న ప‌గా ను వేసింది. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ ను గ‌ద్దెదింపి.. ఆప్ అధికారం చేజిక్కించుకుంది. మొత్తం మీద కాంగ్రెస్ మాత్రం ఘోరప‌రాభ‌వాన్ని పొందింది.  ఈ త‌ర‌ణంలో ఘోరపరాజయంపై ఆదివారం నాడు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) అత్య‌వ‌స‌ర భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు గంటలపాటు వైఫ‌ల్యాల‌కు గల కార‌ణాల గురించి చ‌ర్చించారు. త‌క్ష‌ణ‌మే అవసరమైన దిద్దుబాటు చర్యలను చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి సోనియాగాంధీ నాయకత్వంలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకుంది. 

ఇదే సమావేశంలో అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ  కాంగ్రెస్ ఓటమిపై చర్చిస్తూ.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ల తీరును త‌ప్పు ప‌ట్టిన‌ట్లు స‌మాచారం. కెప్టెన్  అమరీందర్ సింగ్‌పై పార్టీ రాష్ట్ర శాఖలో వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ ప్రతిసారి తాను వెనకేసు వచ్చి తప్పు చేసినట్టు సోనియాగాంధీ అంగీకరించినట్టు సమాచారం. కొత్తసారథి కావాలిపంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరాటాన్ని ఆ రాష్ట్ర ఇన్‌చార్జి హరీష్ చౌదరి ఈ సమావేశంలో ప్రస్తావిస్తూ..పంజాబ్ లో ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా.. కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను ఆలస్యంగా సీఎం పదవి నుంచి తొలగించడమేన‌ని భావించారు.  రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోవడానికి ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. 

కెప్టెన్  అమరీందర్ సింగ్‌పై పార్టీ రాష్ట్ర శాఖలో వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ.. సోనియా గాంధీ ఆ విష‌యాన్ని వెనుక‌వేసుక‌వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. కెప్టెన్ అమరీందర్‌ను తొలగించాలని పార్టీ అధిష్ఠానం కోరుకుని ఉంటే.. ఆ పని ముందే చేసి ఉండాల్సిందని, అలా చేసి ఉంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల సమయానికి సద్దుమణిగేదని ఇత‌ర నేత‌లు అభిప్రాయప‌డ్డారు. ఈ విష‌యంపై  సోనియాగాంధీ స్పందిస్తూ.. కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ విషయంలో తన తప్పిదం కూడా ఉందన్నారట‌. ఆయనపై (కెప్టెన్) ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి ఆయనను తాను సమర్ధిస్తూ వచ్చానని, ఆ రకంగా తాను తప్పడగుగు వేశానని అంగీకరించార‌ట‌.

అమరీందర్ సింగ్,  పార్టీ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య నెలల తరబడి అంతర్గత తగాదాల జ‌రిగాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు గత సెప్టెంబర్‌లో అమ‌రీంద‌ర్ సింగ్  త‌న సీఎం ప‌ద‌వీకి రాజీనామా చేశారు. అనంత‌రం ఆయ‌న పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని ప్రారంభించాడు. బిజెపితో కలిసి ఎన్నికలలో పోరాడాడు. కానీ ఓట‌మిపాల‌య్యారు.  కెప్టెన్ సింగ్ నిష్క్రమణ తర్వాత.. కెప్టెన్ వారసుడుగా.. చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం టగ్ ఆఫ్ వార్ జ‌రిగింది.  ఫైన‌ల్ గా చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పగ్గాలు అప్పగించింది అధిష్టానం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu