Karnataka Elections 2023: ‘కాంగ్రెస్, బీజేపీ మమ్మల్ని సంప్రదించాయి. నిర్ణయం తీసుకున్నాం’: జేడీఎస్ సంచలనం

Published : May 12, 2023, 01:21 PM IST
Karnataka Elections 2023: ‘కాంగ్రెస్, బీజేపీ మమ్మల్ని సంప్రదించాయి. నిర్ణయం తీసుకున్నాం’: జేడీఎస్ సంచలనం

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రానుండగా.. జేడీఎస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమను కాంగ్రెస్, బీజేపీ రెండూ సంప్రదించాయని తెలిపింది. ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని వివరించింది.  

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయం ఇంకా వేడిగానే ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు సమీకరణాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నట్టూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పడంతో జేడీఎస్ హుషారుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమను కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ సంప్రదించాయని, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరాయని జేడీఎస్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్టు వివరించింది.

‘మేం నిర్ణయం తీసేసుకున్నాం. సరైన సమయంలో ఆ నిర్ణయాన్ని వెల్లడిస్తాం’ అని జేడీఎస్ సీనియర్ లీడర్ తన్వీర్ అహ్మద్ ఓ జాతీయ మీడియాకు తెలిపారు.

కాగా, ఈ వాదనలను బీజేపీ తిరస్కరించింది. తాము జేడీఎస్‌ను సంప్రదించలేదని, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రజా తీర్పు తమకు వస్తుందని తెలిపింది.

బీజేపీ నేత శోభ కరండ్లాజే మాట్లాడుతూ.. కూటమి ప్రశ్నే లేదని, జేడీఎస్‌ను బీజేపీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. 120 సీట్లు తాము తప్పకుండా గెలుస్తామని వివరించారు. క్షేత్రస్థాయిలోని తమ కార్యకర్తల నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత తమకు 120 సీట్లు వస్తాయనే నిర్దారణకు వచ్చామని చెప్పారు.

ఇదే విషయాన్ని జేడీఎస్‌ నేత ముందు ప్రస్తావించగా.. లేదు.. ఆ రెండు పార్టీలూ తమను సంప్రదించాయని వివరించారు. ఆ రెండు పార్టీలు తమను సంప్రదించే స్థాయిలోనే  జేడీఎస్ ఉన్నదని తన్వీర్ అహ్మద్ అన్నారు. 

Also Read: నా గ్రామానికి ఎప్పటికీ తిరిగి వెళ్లను.. ఇప్పటికీ ప్రాణభయం ఉంది: సామూహిక అత్యాచార బాధితురాలి ఆవేదన

ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రశ్నించగా.. రాష్ట్రానికి, కన్నడిగుల జీవితాలను మెరుగపరిచే వారితో చేతులు కలుపుతామని ఆయన తెలిపారు.

జేడీఎస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకోగలదని భావిస్తున్నారని అడగ్గా.. తాము లేకుండా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని మాత్రం స్పష్టంగా చెప్పుతున్నా అని అహ్మద్ అన్నారు. తమకు చెప్పుకోదగ్గట్టుగానే సీట్లు వస్తాయని భావిస్తున్నట్టు వివరించారు. జాతీయ పార్టీలకు ఉన్న డబ్బు, మార్బలం, మందిబలం తమకు లేదని అన్నారు. తమ పార్టీ బలహీనమైన పార్టీ, అయినా ప్రభుత్వంలో తాము భాగమయ్యే స్థాయిలో మాత్రం సీట్లు వచ్చేలా కష్టపడ్డామని తెలిపారు.

జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ కుమా రస్వామి అనా రోగ్యం కారణంగా సింగ పూర్ వెళ్లారు. అక్కడే రోటీన్ చెకప్ చేసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఆయన మళ్లీ తిరిగివస్తాయరి పార్టీ వర్గాలు తెలిపాయి.

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu