Kargil Vijay Diwas 2022 : గత యూపీఏ ప్రభుత్వం కార్గిల్ వీరుల త్యాగాన్ని గుర్తించలేదు.. రాజీవ్ చంద్రశేఖర్..

Published : Jul 26, 2022, 09:57 AM IST
Kargil Vijay Diwas 2022 : గత యూపీఏ ప్రభుత్వం కార్గిల్ వీరుల త్యాగాన్ని గుర్తించలేదు.. రాజీవ్ చంద్రశేఖర్..

సారాంశం

గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కార్గిల్ అమరవీరుల త్యాగాలను గుర్తించలేదని.. పార్లమెంటులో తాను లేవనెత్తేవరకు కార్గిల్ విజయ్ దివస్ జరగలేదంటూ బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలను ట్వీట్ చేశారు. 

ఢిల్లీ : ఈ రోజు Kargil Vijay Diwas. అయితే 2004-2009వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని UPA Governament.. పదేళ్ల పాటు కార్గిల్ వీరుల సృత్యర్థం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ జరపలేదు అని మీకు తెలుసా? అంటూ బీజేపీ ఎంపీ Rajeev Chandrasekhar ప్రశ్నించారు. కార్గిల్ అమరవీరులకు, మన సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును సెలబ్రేట్ ఎందుకు చేసుకోకూడదంటూ తాను రాజ్యసభలో లేఖాముఖంగా ప్రశ్నించేవరకు అది జరగలేదని.. అప్పటి ఉత్తరప్రత్యుత్తరాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

2009లో జూలై 21న రాజ్యసభలో ‘అత్యవసరమైన పబ్లిక్ ఇంపార్టెన్స్ విషయాన్ని ప్రస్తావించాలి’ అంటూ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఒక నోటీసును ఇచ్చారు. 23వ తేదీన సభలో కార్గిల్ విజయ్ దివస్ కు సంబంధించి ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వాలని హౌస్ ఛైర్మన్ ను కోరారు. దీంట్లో ‘జూలై 26న కార్గిల్ విజయోత్సవానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా.. మన వీరుల పరాక్రమం, శత్రువుల మీద సాధించిన వీరోచిత పోరాట విజయాన్ని అందరూ స్మరించుకోవాలని’ కోరారు.

కార్గిల్ విజయ్ దివస్ ని దేశమంతా జరుపుకోవడానికి కారకుడు ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

ఈ రోజు కేవలం భారత్ సాధించిన విజయాన్ని చెప్పే రోజు మాత్రమే  కాదు.. మన శతృవులకు మన సత్తా, పరాక్రమం ఏంటో నిరూపించిన రోజు. భారత సాయుధ బలగాల్లోని స్త్రీ, పురుణుల త్యాగాన్ని నిరూపించిన రోజు. వారి స్పూర్తి దాయకమైన విధినిర్వహణను చాటిన రోజు. చాలా మంది భారతీయుల మాదిరిగానే నేనూ ప్రతీరోజూ వారి విజయాలను గుర్తు చేసుకుంటాను. ఇది యువతరానికి స్ఫూర్తినిచ్చే జాతీయవాదం, కర్తవ్యాన్ని భోదించే సంఘటన. ఆ యుద్ధంలో మన సాయుధ బలగాలకు చెందిన పురుషులు, స్త్రీలు ఎంతో సాహసోపేతంగా పోరాడారు. వారికి మనం శ్రద్ధాంజలి ఘటించడం, గౌరవించడం.. నమస్కారించడం అవసరం. వారి త్యాగాలకు ప్రతీకగా ఈ రోజును స్మరించుకోవాలని, ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. 

దీంతోపాటే.. బీజేపీ ప్రతిపాదిస్తుంది కాబట్టి వ్యతిరేకించాలనే హాస్యాస్పద చర్యలకు పూనుకోవద్దని.. ఈ త్యాగం దేశం మొత్తం గుర్తించదగినది. కాబట్టి, మద్దుతనివ్వాలని కూడా సభలోని తోటి సభ్యులకు ఆయన సూచించారు. పార్టీలు,మతాలకు అతీతంగా వారు మన దేశానికి సేవలు చేసిన వారు. వారి కుటుంబాలను గౌరవించడం మన బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. దీనిమీద డిఫెన్స్ మినిస్ట్రీ స్పందించింది. రాజ్యసభలో 23 జూలైనాడు చేసిన ప్రతిపాదన ప్రకారం.. ‘యేటా కార్గిల్ అమరవీరుల త్యాగాలను ను స్మరించుకుంటూ ఈ రోజును విజయ్ దివస్ గా జరుపుతామని చెప్పుకొచ్చారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని 2010జూలై 26నాడు అమర జవాన్ జ్యోతిని కూడా నిర్వహిస్తామని అప్పటి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని తెలిపారు. వీటికి సంబంధించిన ఉత్తరాలను మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !