త్రిపురలో సీపీఐ(ఎం), బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి.. 20 మందికి గాయాలు..

By team teluguFirst Published Dec 1, 2022, 4:56 PM IST
Highlights

త్రిపురులో బీజేపీ, సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య బుధవారం భీకర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో ఉన్న చరిలాంలో బుధవారం సీపీఐ(ఎం), బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ హింసాత్మక ఘర్షణలో 75 ఏళ్ల షాహిద్ మియాన్ మరణించగా, భద్రతా సిబ్బందితో పాటు మరో 20 మంది గాయపడ్డారు. పలువురు క్షతగాత్రులను అగర్తలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇరు పార్టీల మద్దతుదారుల నలుగురిని అరెస్టు చేశామని. ఈ ఘటనకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని అన్నారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ వాగ్వాదంలో తమ సిబ్బందిపై కూడా దాడి జరిగింది, దీనిని కూడా పోలీసులు సుమోటాగా స్వీకరించి కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాఫర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ .. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం ..

వివిధ డిమాండ్లతో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వద్దకు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు వందలాది మంది సీపీఐ(ఎం) మద్దతుదారులు చరిలంలోని పార్టీ కార్యాలయంలో గుమిగూడారు. అయితే అకస్మాత్తుగా పలువురు వ్యక్తులు బాంబులు అక్కడ గందరగోళం సృష్టించారు. దీంతో లాఠీలు, ఇనుప రాడ్లతో దాడి జరిగింది. దీనిపై మాజీ ఆర్థిక మంత్రి భాను లాల్ సాహా స్పందిస్తూ.. ‘బీజేపీ మద్దతు ఉన్న దుండగులు’ బాంబులు విసిరి దాడి చేశారని ఆయన తెలిపారు.

కాగా.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, చరిలం ఎమ్మెల్యే అయిన జిష్ణు దేవ్‌వర్మ భాను లాల్ ఆరోపణను ఖండించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాహా హింసాకాండకు నాయకత్వం వహించారని ఆరోపించారు. మాజీ మంత్రి కిరాయి గూండాల సహాయంతో ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్తలను అతడి ప్రయత్నాలను వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చెలరేగిందని ఆయన చెప్పారు.

తమిళనాడులో ఇంకా అంటరానితనం.. ఎస్సీలో విక్రయించమన్న కిరాణం యజమాని.. వీడియో వైరల్

గాయపడిన తన పార్టీ కార్యకర్తలను జీబీపీ ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్ పరామర్శించారు. ఈ ఘటనను పూర్తిగా ఖండించారు. ‘‘త్రిపురలో ప్రతిపక్ష పార్టీల రాజకీయ కార్యకలాపాలను నిషేధించారు. గత నాలుగైదేళ్లలో ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే వారు తగిన సమాధానం ఇస్తారు. ’’ అని అన్నారు. నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

హనుమాన్ చాలీసా కేసు.. ఎంపీ నవనీత్ రాణా, భర్త రవికి అరెస్టు వారెంట్ జారీ..

దీనిపై సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుశాంత చౌదరి మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) మద్దతు ఉన్న దుండగులు ప్రణాళికతో తమ పార్టీ కార్యకర్తలపై ఆకస్మికంగా దాడి చేశారని అన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను తాను జీబీపీ ఆస్పత్రిని పరామర్శించారని అన్నారు. ఈ పవిత్ర భూమి త్రిపురలో ఉగ్రవాదం, హింసకు తావు లేదని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు దుష్టశక్తులు ఇలాంటి హింసాత్మక ఘటనలు సృష్టిస్తున్నాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం పన్నిన ఈ నీచమైన కుట్రకు రాష్ట్ర వాసులు తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. 

click me!