
Commercial LPG cylinder prices: పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను శనివారం నుండి యూనిట్ కు రూ.91.50 తగ్గించాయి. ప్రస్తుతం దేశ రాజధానిలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,028గా ఉంది.
వివరాల్లోకెళ్తే.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గించాయి. పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరను శనివారం నుండి తక్షణమే అమలులోకి వచ్చేలా యూనిట్‌కు రూ.91.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,028 కు చేరుకుంది. అయితే, గృహ వినియోగ (దేశీయ) ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అంతకుముందు భారీ పెంపు..
పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ ఏడాది మార్చి 1న వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను ఒక యూనిట్ కు ఏకంగా రూ.350.50 పెంచాయి. ఇదే సమయంలో గృహ వినియోగ దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను యూనిట్ కు రూ.50 పెంచాయి. దీంతో ఎన్నడూ లేనంతగా కమర్షియల్, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. అంతకుముందు జనవరి 1న కూడా కమర్షియల్ సిలిండర్ ధరను యూనిట్ కు రూ.25 పెంచారు.
చివరగా గతేడాది కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి..
వాణిజ్య సిలిండర్ల ధరలు చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్ 1న రూ.91.50 తగ్గాయి. 2022 ఆగస్టు 1న కూడా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.36 తగ్గాయి. అంతకు ముందు జూలై 6న 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను యూనిట్ కు రూ.8.5 తగ్గించారు. అయితే, మొత్తంగా చూసుకుంటూ దేశంలో ఎన్నడూ లేనంతగా ఎల్‌పీజీ సిలిండర్ ధరల మోత ఉందనేది వాస్తావం. పెరుతుగున్న నిత్యావసరల ధరలు, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు సామాన్య ప్రజానీకం పై ప్రభావం చూపుతున్నాయి. దీని వల్ల పేదల ఉపయోగిస్తున్న ఎల్‌పీజీ సిలిండర్ల రీఫిల్లింగ్స్ సైతం తగ్గుముఖం పట్టాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.