
హర్యానాకు చెందిన ఓ వృద్ధ దంపతులు మార్చి 29వ తేదీ రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఆత్మహత్యకు ముందు ఓ నోట్ రాసి పెట్టారు. అందులో వారు అనుభవించిన మనోవేధనను ప్రస్తావించారు. తమ కుమారుడికి రూ.30 కోట్ల విలువైన ఆస్తి ఉందని, అయితే తమకు తిండి పెట్టడానికి కూడా వారు నిరాకరించారని ఆ దంపతులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆ దంపతులు పోలీసు కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి సమాచారం అందించారు.
ఢిల్లీలోని జీబీ రోడ్‌లో సెక్స్ వర్కర్ హత్య కేసులో ఇద్దరు సోదరులు, స్నేహితుడి అరెస్ట్
వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని చర్ఖీ దాద్రిలోని బద్రాలోని శివ్ కాలనీలో జగదీష్ చంద్ర ఆర్య (78), భగ్లీ దేవి (77) గత బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమ ఆత్మహత్యకు కారణమేమిటో పేర్కొంటూ ఆ దంపతులు రాసిన సూసైడ్ నోట్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. అందులో దంపతులు రాసిన అంశాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. రూ.30 కోట్ల ఆస్తి ఉన్న తన కుమారుడు తమకు రెండు పూటలా భోజనం కూడా పెట్టడానికి నిరాకరిస్తున్నాడని జగదీష్ చంద్ర ఆర్య సూసైడ్ నోట్ లో రాశాడు.
‘‘మేము గతంలో మా మరో కుమారుడు మహేందర్ తో కలిసి బద్రాలో నివసించేవాళ్లం. అయితే అతడు ఆరేళ్ల కిందట చనిపోయాడు. దీంతో మేము కోడలు నీలంతో కలిసి జీవించడం ప్రారంభించాం. కానీ కొంత కాలం తరువాత ఆమె మమల్ని బయటకు వెళ్లగొట్టింది. రెండేళ్ల పాటు వృద్ధాశ్రమంలో ఉండాలని ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది’’ అని ఆర్య అందులో పేర్కొన్నారు.
డిటోనేటర్ల అక్రమ రవాణా..ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ..
దీంతో చివరకు ఆ దంపతులు రూ.30 కోట్ల విలువైన ఆస్తి ఉన్న మరో కుమారుడు వీరేందర్ దగ్గరికి తిరిగి వచ్చారు. అతడికి వివాహమైంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఈ వృద్ధ దంపతులకు మిగిలిపోయిన భోజనం పెట్టేవారు. ‘‘ నా భార్యకు పక్షవాతం వచ్చింది. కానీ మా కుమారుడు వీరేందర్, కోడలు మాకు మిగిలిపోయిన ఆహారాన్ని అందించేవాడు.’’ అని ఆయన జగదీష్ చంద్ర ఆర్య అందులో ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన జగదీశ్ చంద్ర ఆర్య, భాగ్లీ దేవి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ మరణానికి తన కుమారుడు వీరేందర్, ఇద్దరు కోడళ్లే కారణమని ఆర్య పేర్కొన్నారు. తన పేరు మీద ఉన్న ఆస్తిని అలాగే వదిలేశానని, దానిని బద్రాలోని ఆర్యసమాజ్ కు ఇవ్వాలని, తమతో ఇంత దారుణంగా వ్యవహరించిన కుటుంబ సభ్యులను శిక్షించాలని ఆర్య సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.
మాస్క్ తప్పనిసరి.. పెరుగుతున్న XBB.1.16 వేరియంట్ కేసులు
కాగా.. అనారోగ్యంతో తన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని, అందుకే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని వీరేందర్ పేర్కొన్నారని ‘ఇండియా టుడే’ కథనం నివేదించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి సూసైడ్ నోట్ లో పేర్కొన్న వారందరినీ విచారిస్తున్నారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.