కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర: అవార్డును స్వీకరించిన కుటుంబ సభ్యులు

By narsimha lodeFirst Published Nov 23, 2021, 11:27 AM IST
Highlights

ఇండియా-చైనా సరిహద్దులో గాల్వాన్ లో వీర మరణం పొందిన  కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు దక్కింది. సంతోష్ బాబు కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించారు. 

న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దులోని గాల్వాన్ లో వీరోచితంగా పోరాటం చేసి వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కు మహవీర్ చక్ర అవార్డు దక్కింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు కుటుంబసభ్యులు మంగళవారం నాడు ఈ అవార్డును స్వీకరించారు.గత ఏడాది జూన్ మాసంలో Galwan లోయలో china సైన్యం జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు , నాయబ్ సుబేదార్, సుదురామ్ సోరేన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయి గుర్తేజ్ సింగ్ లు మరణించారు. వీరికి మరణించిన తర్వాత వీర చక్రాలను ప్రకటించింది కేంద్రం.

Colonel Santosh Babuది  తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా. సంతోష్ బాబు  భార్యకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. అంతేకాదు సంతోష్ బాబు కుటుంబానికి హైద్రాబాద్ లో ఇంటి స్థలం ఇచ్చింది.Jammu and kashmir  లోని కెరాన్ సెక్టార్ లో ఒక ఉగ్రవాదిని హత్య చేసి, మరో ఇద్దరిని గాయపర్చిన 4 పారా స్పెషల్ ఫోర్సెస్ జవాన్ సంజీవ్ కుమార్ కు చనిపోయిన తర్వాత కీర్తి చక్ర అవార్డు దక్కింది.సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో గ్రూప్ కెప్టెన్ అభినందన్  సహా పలువురు వీర జవాన్లు ప్రదర్శించిన అత్యంత ధైర్య సాహసాలకు గాను రాష్ట్రపతి  Ramnath kovind సత్కరించారు. సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో గ్రూప్ కెప్టెన్ అభినందన్  సహా పలువురు వీర జవాన్లు ప్రదర్శించిన అత్యంత ధైర్య సాహసాలకు గాను రాష్ట్రపతి  Ramnath kovind సత్కరించారు. 

also read:కల్నల్ సంతోష్ బాబు స్పూర్తితో... దేశ రక్షణలో యువత ముందుండాలి: మంత్రి జగదీష్ రెడ్డి

16 బీహార్ రెజిమెంట్ కు కమాండింగ్ అధికారిగా కల్నల్ సంతోష్ బాబు వ్యవహరించారు.  గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకొనన్ సమయంలో సంతోష్ బాబు నేతృత్వంలోని ఇండియన్ ఆర్మీ చైనాకు ధీటుగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు మరణించారు. సంతోష్ బాబు మరణించిన తర్వాత మహావీర్ చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.చైనా ఆర్మీ దాడిలో గాయపడినపప్పటికీ సంతోష్ బాబు తన సైన్యాన్ని సంపూర్ణ కమాండ్, కంట్రోల్ తో ముందుకు నడిపించారు. శతృవుల దాడిని నిలువరించారని ఆ ఘటన చోటు చేసుకొన్న సమయంలో  ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

ఇండియా చైనా మధ్య తూర్పు లడఖ్ లో 2020 మే నుండి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకొంది. భారీ ఆయుధాలతో పాటు పదివేల మంది సైనికులను చైనా తరలించింది.ఇరు పక్షాలు కూడా తమ సైనికులను సరిహద్దు వెంట మోహరించాయి.గత ఏడాది జూన్ లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 21 మంది ఇండియన్ సైనికులు మరణించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సైనిక , దౌత్యపరమైన చర్చల శ్రేణి తర్వాత ఇరుపక్షాలు కొంత వెనక్కు తగ్గాయి.

గాల్వన్ లోయలో ఆ రోజు ఏం జరిగిందంటే?

జూన్ 6న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా గాల్వన్ లోయలో నిర్మించిన తాత్కాలిక చెక్ పోస్టులను తొలగించడానికి అక్కడి నుండి వెనక్కి వెళ్లడానికి  చైనా అంగీకరించింది.  చైనా బలగాల ఉప సంహరణ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే చూడడం కోసం సంతోష్ బాబు నేతృత్వంలో  జూన్ 15న సంతోష్ బాబు బృందం గాల్వన్ లోయలోకి వెళ్లింది.  భారత భూభాగంలో చైనా సైనికులు అబ్జర్వేషన్ పోస్టు నిర్మాణం చేపట్టినట్టు గుర్తించారు. 

చైనా అదనపు బలగాలను గుర్తించిన సంతోష్ బాబు తమ భూభాగంలో నిర్మించిన తొలగించాలని చైనాను  ఆర్మీని కోరారు. అయితే ఈ సమయంలోనే చైనా సైనికుడు సంతోష్ బాబును వెనక్కు నెట్టారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. భారత సైన్యం చైనా పోస్టును దగ్దం చేసింది.  అదనపు బలగాలను కూడా సంతోష్ బాబు రప్పించారు. అయితే అప్పటికే చైనా ఆర్మీ భారీగా అక్కడికి చేరుకొని భారత సైన్యంపై దాడికి దిగింది. రాత్రి సమయంలో సంతోష్ బాబు సహా పలువురిపై  చైనా ఆర్మీ చేసిన దాడిలో 21 మంది మరణించారు.
 

click me!