కాలేజీ స్టూడెంట్ ప్రాణం తీసిన అక్రమసంబంధం..

Published : Dec 30, 2020, 04:32 PM IST
కాలేజీ స్టూడెంట్ ప్రాణం తీసిన అక్రమసంబంధం..

సారాంశం

వింత పోకడలు, విచిత్ర సంబంధాలు మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా చేస్తున్నాయి. ప్రతీ చిన్న విషయానికి విలువైన ప్రాణాల్ని బలి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటన ముంబైలో జరిగింది.

వింత పోకడలు, విచిత్ర సంబంధాలు మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా చేస్తున్నాయి. ప్రతీ చిన్న విషయానికి విలువైన ప్రాణాల్ని బలి చేస్తున్నారు. అలాంటి ఓ ఘటన ముంబైలో జరిగింది.

కాలేజీ స్టూడెంట్‌ కు ఓ మహిళతో ఏర్పడిన అక్రమ సంబంధం చివరికి అతని ప్రాణం బలితీసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెలోని కొయాలి గ్రామానికి చెందిన ఆకాశ్‌ అనే 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌కు నెల రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో సంగీత అనే మహిళ పరిచయమైంది. 

ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. తమ అక్రమ సంబంధాన్ని ఆకాశ్‌ తల్లిదండ్రులకు చెబుతానంటూ సంగీత బెదిరించసాగింది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఆకాశ్‌ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆకాశ్‌ మొబైల్‌ ఫోన్‌​ కాల్‌ డేటా ఆధారంగా సంగీత బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?