జగన్నాథ ఆలయానికి రూ. లక్ష విరాళమిచ్చిన 70 ఏళ్ల యాచకురాలు.. ఎక్కడంటే ?

By team teluguFirst Published Dec 17, 2022, 3:16 PM IST
Highlights

ఆమె నలబై ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. ఇప్పుడామె వయస్సు 70 సంవత్సరాలు. ఇంత కాలం భిక్షాటన చేయడం వల్ల ఆ మహిళ వద్ద డబ్బులు పోగయ్యాయి. వాటిని జగన్నాథ స్వామి ఆలయ పునరుద్దరణకు అందజేసింది. ఇది ఒడిశాలో చోటు చేసుకుంది. 

జీవితాంతం యాచిస్తూ సేకరించిన రూ. లక్షలను జగన్నాథ ఆలయ పునరుద్ధరణ కోసం విరాళంగా అందజేసింది 70 ఏళ్ల వృద్ధురాలు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని ఫుల్బానీలో పురాతన జగన్నాథ ఆలయం ఉంది. అయితే తాజాగా దానిని రిపేర్ చేయాలని భావిస్తున్నారు. దీని కోసం దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. దీంతో ఆ వృద్ధురాలు పైసా పైసా సేకరించి కూడబెట్టుకున్న డబ్బును విరాళంగా అందజేసి తన ధాతృత్వాన్ని చాటుకుంది. 

శ్రద్దా వాకర్ మర్డర్ కేసు: 22న అఫ్తాబ్ బెయిల్ పిటిషన్ విచారించనున్న ఢిల్లీ కోర్టు

విరాళం అందించిన మహిళ పేరు తులా బెహరా. గత 40 ఏళ్లుగా ఫుల్బానీ పట్టణంలోని వివిధ దేవాలయాల దగ్గర ఆమె భిక్షాటన చేస్తున్నారు. తుల శారీరకంగా వికలాంగుడైన ప్రఫుల్ల బెహెరాను వివాహం చేసుకున్నారు. దంపతులు ఇద్దరు కలిసి పట్టణంలో భిక్షాటన చేసేవారు. కొంత కాలం తరువాత ప్రఫుల్ల మరణించాడు. దీంతో తులా ఒంటరిగా మిగిలిపోయింది.

బీహార్‌లో కల్తీ మద్యం విధ్వంసం.. 70 మందికి పైగా మృత్యువాత !

ఆ మహిళకు సన్నిహితులు ఎవరూ లేకపోవడంతో ఫుల్బానీ జగన్నాథ ఆలయం సమీపంలోనే భిక్షాటన చేస్తూ ఉండిపోయింది. అలా సేకరించిన డబ్బులో తన అవసరాలకు వాడుకొని మిగిలినవి పొదుపు చేశారు. అయితే చాలా కాలం నుంచి ఆ డబ్బును ఆలయానికి విరాళంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాన్ని పునరుద్దరిస్తున్నారని తెలిసి తన వద్ద ఉన్న లక్ష రూపాయిలను అందించాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ఆమె తన సంపాదన మొత్తం జగన్నాథ ఆలయ కార్యనిర్వహణ కమిటీకి అందించారు.

ఖర్గే ‘రిమోట్ కంట్రోల్’ కాకపోతే కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలి - బీజేపీ

అయితే మొదట్లో ఆ మహిళ నుంచి డబ్బును స్వీకరించడానికి ఆలయ కమిటీ అంగీకరించలేదు. కానీ భగవంతుడిపై ఆమెకు ఉన్న భక్తిని చూసి చివరికి అంగీకరించారు. “ నాకు తల్లిదండ్రులు, పిల్లలు లేరు. నా జీవితం చివరి దశలో ఉంది. ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు. జగన్నాథుడికి సేవ చేసుకుంటూ ఉండిపోతాను. అందుకే భిక్షాటన ద్వారా నేను నా బ్యాంకు ఖాతాలో పొదుపు చేసిన డబ్బును జగన్నాథునికి విరాళంగా ఇచ్చాను” అని తులా చెప్పారు.

రాహుల్ గాంధీ ప్రకటనపై బీజేపీ నేతల ఫైర్.. అసలేం జరిగింది...?

“ఆమె (తులా) నా దగ్గరికి వచ్చింది. భిక్షాటన ద్వారా సేకరించిన డబ్బును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పింది. కానీ నేను ఆమె నుంచి డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా వృద్ధురాలు పట్టుబట్టడంతో మేము దానిని అంగీకరించాం ’’ అని ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు సునాసిర్ మొహంతి తెలిపారు.
 

click me!