ఉత్తరప్రదేశ్ లో చలి పంజా.. కాన్పూర్ లో 25 మంది మృతి.. నోయిడాలో పడినపోయిన ఉష్ణోగ్రతలు

By team teluguFirst Published Jan 6, 2023, 12:52 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగ మంచు కప్పేస్తోంది. చలిని తట్టుకోలేక కాన్పూర్ లో 25 మంది మరణించారు. 

ఉత్తరప్రదేశ్‌లో చలి పంజా విసురుతోంది. విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. యూపీలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. చలిని తట్టుకోలేక గురువారం కాన్పూర్ లో 25 మంది మరణించారు. చలిలో అకస్మాత్తుగా రక్తపోటు పెరగడం, రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ సంభవించిందని వైద్యులు తెలిపారు. 25 మంది మృతుల్లో 17 మందికి ఎలాంటి వైద్య సాయం అందక ముందే ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీ మేయర్ ఎన్నిక: ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, కుర్చీలపై ఎక్కి నిరసన

కాగా.. మరో రెండు మూడు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ అంతటా దట్టమైన పొగమంచుతో చలిగాలులు వీచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కాన్పూర్ కార్డియాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఎమర్జెన్సీలోని ఓపీడీని గురువారం 723 మంది హార్ట్ పేషెంట్లు సందర్శించారు. అయితే ఆసుపత్రిలో చలి కారణంగా చికిత్స పొందుతున్న ఏడుగురు గుండెజబ్బు కారణంగా మరణించారు. మరో పదిహేను మంది రోగులు చనిపోయిన స్థితిలోనే హాస్పిటల్ కు వచ్చారు. 

ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు చలి తీవ్రతతో విలవిలలాడుతున్నారు. నోయిడా, ఘజియాబాద్, అయోధ్య, కాన్పూర్, లక్నో, బరేలీ, మొరాదాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, తూర్పు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజుల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. లక్నోలోని భారత వాతావరణ శాఖ కేంద్రంలో నేటి ఉదయం 8:30 గంటలకు 7 డిగ్రీల సెల్సియస్, గోరఖ్‌పూర్‌లో 8.8 డిగ్రీల సెల్సియస్, గౌతమ్ బుద్ నగర్‌లో 7.01 డిగ్రీల సెల్సియస్, మెయిన్‌పురిలో 8.51 డిగ్రీల సెల్సియస్, ఆగ్రా 9.31 డిగ్రీల సెల్సియస్, మీరట్ లో 7 డిగ్రీల సెల్సియస్, ప్రయాగ్‌రాజ్ లో 7.8 డిగ్రీల సెల్సియస్, వారణాసిలో  9.8 డిగ్రీల సెల్సియస్, బరేలీలో 7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముస్లిం మహిళ మళ్లీ పెళ్లి చేసుకునే వరకు విడాకులు తీసుకున్న భర్త నుంచి భరణం పొందొచ్చు - అలహాబాద్ హైకోర్టు

ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు కూడా తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచుతో అల్లాడిపోతున్నాయి. ఢిల్లీలోని ఆయనగర్‌లో శుక్రవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురవారం ఢిల్లీలో మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

జమ్మూ, కాశ్మీర్‌లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాజధాని శ్రీనగర్‌లో ఇంతకు ముందు గురువారం రాత్రి - 5.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. బుధవారం రాత్రి - 6.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. ఈ సీజన్ లో ఇదే అత్యంత చలిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నదని, రానున్న వారాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

ఢిల్లీ అంజలీ సింగ్ ఘటన : ప్రమాద సమయంలో కారులో ఉన్నది ఐదుగురు కాదు.. నలుగురే...

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బటిండాలో 3 డిగ్రీల సెల్సియస్, లూథియానాలో 5.7 డిగ్రీల సెల్సియస్, పాటియాలాలో 5 డిగ్రీల సెల్సియస్, అమృత్‌సర్‌లో 5.5 డిగ్రీల సెల్సియస్, మొహాలీలో 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 

click me!