సీఎం యోగి దీపావళి వేడుకలు ఎక్కడ, ఎవరితో జరుపుకోనున్నారో తెలుసా?

By Arun Kumar PFirst Published Oct 30, 2024, 7:10 PM IST
Highlights

ఎనిమిదేళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇంతకీ ఆయన ఎక్కడ జరుపుకుంటారో తెలుసా? 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈసారి కూడా దీపావళి వేడుకలను తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో జరుపుకోనున్నారు. కుస్మి ఫారెస్ట్ ఏరియాలోని జంగిల్ టికోనియా నంబర్ త్రీ గ్రామాన్ని దీపావళి రోజున సందర్శించనున్నారు యోగి. ఇలా వంతంగియా ప్రజలతో కలిసి పండగ జరుపుకుని ఆ ప్రాంతంలో వెలుగులు నింపే ప్రకటన చేయనున్నారు. జిల్లాలోని 74 గ్రామ పంచాయతీలకు ప్రయోజనం చేకూర్చేలా ₹185 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను దీపావళి కానుకగా సీఎం యోగి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

సీఎం యోగి దీపావళి రోజున అంటే రేపు గురువారం తమ గ్రామానికి వస్తున్నట్లు తెలిసి ప్రజలు ఆనందిస్తున్నారు... ఆయన రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన జంగిల్ టికోనియా నంబర్ త్రీ గ్రామం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన చర్యల వల్ల పునరుజ్జీవనానికి చిహ్నంగా మారింది. 

Latest Videos

2009 నుంచి సీఎం యోగి వంతంగియా సమాజంతో దీపావళి జరుపుకుంటున్నారు, ఎంపీగా ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని 2017లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. ఇలా సీఎం యోగి ప్రతిఏటా తమతో దీపాావళి వేడుకలు జరుపుకోవడంతో వంతంగియా సమాజానికి ఉజ్వల భవిష్యత్తును అందింది

ఎంపీగా ఉన్నప్పుడు, యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో వంతంగియాల హక్కుల కోసం వాదించి, 2010లో వారికి బస చేసేందుకు అనుమతి పొందారు. 2017లో  ముఖ్యమంత్రి అయిన తర్వాత  వంతంగియా వారికి రెవెన్యూ గ్రామ హోదాను మంజూరు చేసి, ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులుగా చేశారు. అప్పటి నుంచి ఈ గ్రామాలకు గృహాలు, రోడ్లు, విద్యుత్, నీరు, పాఠశాలలు వంటి అవసరమైన వనరులతో పాటు వివిధ ప్రజా సంక్షేమ పథకాల కింద కవరేజీ లభించింది.

ప్రతి దీపావళి మాదిరిగానే ఈసారి కూడా సీఎం యోగి రాక నేపథ్యంలో జంగిల్ టికోనియా గ్రామంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఆయనను ఉత్సాహంగా స్వాగతించడానికి ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. గురువారం జంగిల్ టికోనియా నంబర్ త్రీలో జరిగే వంతంగియా దీపోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ సందర్భంగా జిల్లాలోని 74 గ్రామ పంచాయతీలకు ₹185 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దీపావళి కానుకగా అందిస్తారు. 

వీటిలో జంగిల్ టికోనియా నంబర్ త్రీతో సహా 42 గ్రామాల్లో ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ (గ్రామీణ) ద్వారా ₹150.35 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులను సీఎం యోగి ప్రారంభిస్తారు. అదనంగా  ₹34.66 కోట్ల పనితీరు గ్రాంట్ ద్వారా నిధులు సమకూర్చిన 32 గ్రామ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

click me!