సోమాజిక గూడలోని యశోద హాస్పిటల్‌కు వెళ్లి కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఆయనను పరామర్శించారు. ఏకకాలంలో 54 మంది కార్పొరేషన్ పదవులను తొలగించారు. బీఎస్పీ చీఫ్ మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించింది.
Top Stories: మాజీ సీఎం కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించారు. కేటీఆర్, హరీశ్ రావులతోనూ మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీకి వచ్చి ప్రజా పక్షాన మాట్లాడాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించేలా అధికారులను ఆదేశించినట్టు సీఎం తెలిపారు.
కార్పొరేషన్ చైర్మన్లకు ఉద్వాసన:
కార్పొరేషన్ పదవులను రద్దు చేశారు. చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, వారి సిబ్బందినీ తొలగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి 54 మంది చైర్మన్ల నియామకాలు రద్దు చేశారు. వీరంతా బీఆర్ఎస్ హాయంలో నియమితులైనవారే.
మావోయిస్టుల విజ్ఞప్తి:
భారత కమ్యూనిస్టు (మావోయిస్టు) పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రజలు ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను కోరుకుంటున్నారని, ప్రజా ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని పేర్కొంది. నేరపూరిత అనుభవం గల శివధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి.. రేపటి ఉద్యమాలను అణచివేయాలని అనుకుంటున్నారా? అని ఆరోపించింది. పేద, మధ్య తరగతి ప్రజలకే రైతు బంధు వర్తింపజేయాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఈ ప్రకటన ఆదివారం విడుదలైంది.
మూకుమ్మడి తొలగింపులు:
రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారులను తొలగించినట్టే.. ఇప్పుడు కార్పొరేషన్ల చైర్మన్లకు ఉద్వాసన పలికింది. 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా అకాడమీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, మార్క్ ఫెడ్, రైతు బంధు, ఆయిల్‌ఫెడ్, ఆగ్రోస్ వంటి సంస్థ కార్పొరేషన్ల చైర్మన్లు కాంగ్రెస్ తొలగించింది.
Also Read: Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?
వారసుడిని ప్రకటించిన బీఎస్పీ మాయావతి:
బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మినహాయించి దేశవ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఆకాశ్ పార్టీని సంస్థాగతంగా బలపరిచే బాధ్యతలు తీసుకుంటారు. లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన ఆకాశ్ 2019లోనే లోక్ సభ ఎన్నికల ప్రచారం చేశారు.
Also Read: Bandi Sanjay Kumar: అంతా మన మంచికే.. కరీంనగర్ పార్లమెంటు సీటుపై ‘బండి’ ఫోకస్.. ప్లాన్ ఇదే
ఛత్తీస్‌గడ్‌కు గిరిజన సీఎం:
ఛత్తీస్‌గడ్ సీఎంగా 59 ఏళ్ల గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్‌ను బీజేపీ అధిష్టానం ఎంచుకుంది. మాజీ సీఎ: రమణ్ సింగ్‌ను కాదని ఈయనకు సీఎం పదవి కట్టబెట్టారు. రమణ్ సింగ్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టే పని చేస్తున్నారు. సామాజిక సమతుల్యంలో భాగంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను మోడీ, షా నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ నేత, రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో.. సీనియర్ లీడర్ విజయ్ శర్మలకు డిప్యూటీ సీఎం అవకాశాలను ఇచ్చింది. నేడు మధ్యప్రదేశ్ సీఎం ఎవరనేది బీజేపీ నేతలు తేలనున్నట్టు సమాచారం.