రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు.. సీరియస్‌గా చర్యలు: సీఎం బొమ్మై  

By Rajesh KarampooriFirst Published Nov 26, 2022, 3:28 PM IST
Highlights

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కట్టుబడి ఉన్నామని కర్నాటక  రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రతి పౌరుడికి యూనిఫాం సివిల్ కోడ్ వర్తింపజేయాలన్నారు

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలును రాష్ట్ర ప్రభుత్వం చాలా క్షుణంగా పరిశీలిస్తోందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. బీజేపీ అఖిల భారత మేనిఫెస్టోలో ఇదొక ప్రధానాంశమని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కమిటీలు వేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ మేరకు అన్ని అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నామనీ, త్వరలోనే  నిర్ణయం తీసుకుంటామని అన్నారు.బీజేపీకి సంబంధించినంత వరకు యూసీసీ ఉండాలని భావిస్తుందని అన్నారు. 

రాష్ట్రంలోని  శివమొగ్గలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శిబిరం 'శిక్షణ తరగతుల అభ్యాస్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మట్లాడుతూ.. యూసీసీ అనేది సాధారణ చట్టమని, ఇది సమాజంలోని ప్రతి పౌరుడికి వర్తించాలన్నారు. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడడం లేదని అన్నారు. గోహత్య, మతమార్పిడి నిరోధక చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భారత దేశంలో చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను ప్రభుత్వం ఏ వ్యక్తికి నిరాకరించకూడదని రాజ్యాంగం కూడా చెబుతోందని అన్నారు.  

అయితే..భారత రాజ్యాంగంలో రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో UCCకి స్థానం కల్పించబడింది. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు కోసం దశాబ్దాలుగా బీజేపీ పట్టుబడుతోంది. సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మే 2022లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం UCCని అమలు చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని కమిటీ సూచించింది. అయితే అక్టోబర్ 29, 2022న గుజరాత్ హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ రాష్ట్రంలో  UCCని అమలు చేయాలని యోచిస్తోందని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అస్సాం, హిమాచల్ ప్రదేశ్ కూడా యూసీసీని అమలు చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాయి.

click me!