అమర్‌నాథ్ గుహ వద్దకు భారీగా వరద నీరు.. చిక్కుకుపోయిన 12 వేల మంది భక్తులు

Siva Kodati |  
Published : Jul 08, 2022, 07:26 PM ISTUpdated : Jul 08, 2022, 07:43 PM IST
అమర్‌నాథ్ గుహ వద్దకు భారీగా వరద నీరు.. చిక్కుకుపోయిన 12 వేల మంది భక్తులు

సారాంశం

హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 12 వేల మంది భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. 

హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ గుహ పరిసరాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 12 వేల మంది భక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. జమ్మూకాశ్మీర్ లోని ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా... జూన్ 30న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున అమర్ నాథ్ యాత్ర ముగియనుంది. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి యాత్ర సాగడం లేదు. చివరిసారిగా 2019 జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు యాత్ర జరిగింది. అప్పుడు 3.42 లక్షల మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం