ఇండియాలో టీకా వినియోగం కోసం: డీసీజీఐకు ఫైజర్ ధరఖాస్తు

Published : Dec 06, 2020, 02:04 PM IST
ఇండియాలో టీకా వినియోగం కోసం: డీసీజీఐకు ఫైజర్ ధరఖాస్తు

సారాంశం

రోగులకు కరోనా వ్యాక్సిన్ ఉపయోగించేందుకు  ఫైజర్ ఇండియా డీసీజీఐను అనుమతి కోరింది.ఈ మేరకు ఫైజర్ ఇండియా డీసీజీఐకు ధరఖాస్తు చేసింది.

న్యూఢిల్లీ: రోగులకు కరోనా వ్యాక్సిన్ ఉపయోగించేందుకు  ఫైజర్ ఇండియా డీసీజీఐను అనుమతి కోరింది.ఈ మేరకు ఫైజర్ ఇండియా డీసీజీఐకు ధరఖాస్తు చేసింది.

ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతిని ఇచ్చింది. వచ్చే వారంలో యూకేలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 80 ఏళ్ల వయస్సున్నవారికి ఫైజర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ను అందించనున్నారు.

also read:కరోనా వ్యాక్సిన్ వేసుకోనున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్

వ్యాక్సిన్ దిగుమతి చేసుకొని దేశంలో విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని  ఆ సంస్థ కోరింది. ఈ నెల 4వ తేదీన ఫైజర్ సంస్థ డీసీజీఐకు ధరఖాస్తు చేసుకొందని అధికారులు తెలిపారు.ఇండియా ప్రభుత్వ అనుమతి కోసం ధరఖాస్తు చేసుకొన్న తొలి  వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం.

ఫైజర్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్  ఇతర దేశాల్లో వలంటీర్లపై ప్రయోగం చేశారు. ఈ వ్యాక్సిన్ ఇండియాలో పరీక్షించలేదు. దీంతో భారత ప్రజలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ ఆవశ్యకతను ప్రత్యేక  నిబంధనల కింద రద్దు చేయాలని ఫైజర్ డీసీజీఐని కోరింది.


 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం