విషాదం.. తోటి విద్యార్థులతో గొడవపడి 2వ తరగతి విద్యార్థి మృతి..

By SumaBala BukkaFirst Published Dec 14, 2022, 10:19 AM IST
Highlights

రెండో తరగతి విద్యార్థి.. తోటి విద్యార్థులతో గొడవపడి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. ఈ గొడవలో మిగతా విద్యార్థులు అని ఛాతి మీద పడడంతో చనిపోయాడు.

ఫిరోజాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి మరణించాడు. ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి మృతిపై అధికారులు విచారణకు ఆదేశించారు. పిల్లల గొడవలో తోటి విద్యార్థులు అతని ఛాతీపై దూకడంతో శివం అనే బాలుడు మంగళవారం మృతి చెందాడు. ఏడేళ్ల చిన్నారి అచేతనంగా పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అతని అంతర్గత అవయవాలకు గాయాలయ్యాయి డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ చిన్నారి మరణించాడు. ఈ ఘటన మీద పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

శివమ్‌కి, మరికొందరు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరగడంతో అతని ఛాతీపైకి దూకిన సంఘటన సోమవారం కిషన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు షికోహాబాద్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హర్వీంద్ర మిశ్రా తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ రవి రంజన్, ప్రాథమిక విద్యా అధికారి ఆశిష్ కుమార్ పాండే, ఎస్‌డిఎం షికోహాబాద్ శివ్ ధ్యాన్ పాండే సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వార్నీ.. అర్థరాత్రి వచ్చి చికెన్ రోల్ కావాలని హంగామా.. లేదన్నందుకు హోటల్ కు నిప్పు పెట్టి దారుణం.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ అక్టోబర్ 22న తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుని తెల్లారి పాఠశాలకు వెళ్లాడు ఓ చిన్నారి. అయితే, అంతలోనే అతని గుండె అకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో చోటు చేసుకుంది. వెంకట్రావు పల్లికి చెందిన బుర్ర కుషిత-సతీష్ దంపతులకు కొడుకు కౌశిక్ (9), కుమార్తె మేఘన ఉన్నారు. 

కాగా, బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన క్యూ లైన్‌లో నిల్చున్న మూడో తరగతి విద్యార్థి బుర్ర కౌశిక్ (8) గుండెపోటుతో మృతి చెందాడు. కౌశిక్  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలిచి ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. అది గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు వాహనంలోని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. కొంతకాలంగా  ఫిట్స్,  గుండె సంబంధిత (హార్ట్ వీక్) వ్యాధితో  చిన్నారి బాధ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్  మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

click me!