అలాంటి సైట్ లో భార్య, సోదరి ఫోటోలు... షాకైన వ్యక్తి...!

Published : Dec 14, 2022, 09:47 AM IST
 అలాంటి సైట్ లో భార్య, సోదరి ఫోటోలు... షాకైన వ్యక్తి...!

సారాంశం

వారి అనుమతి లేకపోయినా... ఆ ఫోటోలు పెట్టడం గమనార్హం. దీంతో... అతను వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.... దీనికి సంబంధించిన ఓ మహిళను అరెస్టు చేశారు. 

ఓ వ్యక్తి బాడీ మసాజ్ చేయించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ఆన్ లైన్ లో వెతుకుతుండగా....అతనికి ఊహించని షాక్ తగిలింది. ఎస్కార్ట్ సైట్ లో... అతనికి తన భార్య, సోదరి ఫోటోలు కనిపించడం గమనార్హం. ఎస్కార్ట్, మసాజ్ సైట్లలో తన భార్య ఫోటోలు, తన సోదరి ఫోటోలు ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. వారి అనుమతి లేకపోయినా... ఆ ఫోటోలు పెట్టడం గమనార్హం. దీంతో... అతను వెంటనే ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.... దీనికి సంబంధించిన ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ముంబయి నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల... మసాజ్ చేసేవారి కోసం ఆన్ లైన్ లో వెతికాడు. ఆ సమయంలో.. ఆన్ లైన్ లో అతనికి తన భార్య, సోదరి ఫోటోలు కనిపించడం గమనార్హం. వారి ఫోటోలు చూసిన వెంటనే.. అతను తన భార్య, సోదరితో మాట్లాడగా.. ఆ ఫోటోలు నాలుగు సంవత్సరాల క్రితం ఫోటోలుగా తెలియడం గమనార్హం. తాము సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫోటోలను వారు ఇలా ఉపయోగించినట్లు గుర్తించారు. 

ఆ వ్యక్తి బుకింగ్ కోసం వెబ్‌సైట్‌లో ఇచ్చిన నంబర్‌ను సంప్రదించగా, దానికి ఓ మహిళ సమాధానం ఇచ్చింది. అతను ఖార్ వెస్ట్‌లోని ఒక హోటల్‌లో తనను కలవాలని మహిళను కోరాడు. అందుకు ఆమె అంగీకరించడం గమనార్హం.వెంటనే మహిళ వారిని కలుసుకుంది. తమ కుటుంబ సభ్యుల ఫోటోలు ఎందుకు ఉన్నాయని అతను వారిని ప్రశ్నించగా...  నిందితులు వారితో గొడవ ప్రారంభించి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ వ్యక్తి ఎలాగోలా నిందితురాలిని పట్టుకోగలిగాడు, తరువాత ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విచారణ జరిపిన పోలీసులు ఆ మహిళను - రేష్మా యాదవ్‌గా గుర్తించారు. ఇలాంటి ఎస్కార్ట్, మసాజ్ వెబ్‌సైట్లలో సోషల్ మీడియా నుండి అందమైన మహిళల చిత్రాలను అప్‌లోడ్ చేసే ముఠాలో ఈ  మహిళ భాగం అని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం