పరీక్షా రాయడానికి వచ్చి.. అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన అబ్బాయి

Published : Feb 02, 2023, 09:08 AM ISTUpdated : Feb 02, 2023, 09:22 AM IST
పరీక్షా రాయడానికి వచ్చి.. అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయిన అబ్బాయి

సారాంశం

బీహార్ లోని ఓ పరీక్షా కేంద్రంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. హాలులో అమ్మాయిల్ని చూసి పరీక్ష రాయడానికి వచ్చిన అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడు. 

బీహార్ : బీహార్ లోని నలందలో ఓ ఆశ్యర్యకరమైన ఘటన జరిగింది. అమ్మాయిలను చూస్తే అబ్బాయిలకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.. వారిని ఇంప్రెస్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు నవ్వులపాలవుతుంటారు. దీనికి కాలేజీ, రోడ్డు, పరీక్షా హాల్ అనే తేడాలు లేవు.. అలా అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోవడం.. చిలిపిగా నవ్వులు విసురుకోవడం మామూలే. 

అయితే ఓ అబ్బాయి మాత్రం అమ్మాయిలను చూడగానే దడుసుకున్నాడు. అంతమంది అమ్మాయిల్ని ఒక్కదగ్గర చూసి దెబ్బకు స్పృహతప్పి పడిపోయాడు. పరీక్ష రాసేందుకు వెళ్లి హాల్ లో అమ్మాయిల్ని చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఆశ్చర్యకమైన ఘటన బీహార్ నలందలోని ఓ ఇంటర్ ఎగ్జామ్ హాల్ లో జరిగింది. వెంటనే గమనించిన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. 

మనీష్ శంకర్ అనే 17యేళ్ల విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ పరీక్ష రాసేందుకు తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్ తో సుందర్ గఢ్ లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ కు వచ్చాడు. ఆ తరువాత తండ్రి అతడిని పరీక్ష హాలు దగ్గర వదిలేసి బయటఉన్నాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. 

పంజాబ్ లో పాక్ డ్రోన్స్ కలకలం.. భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం..

మనీష్ శంకర్ పరీక్ష రాసేందుకు హాల్ లోకి వెళ్లాడు. అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వెంటనే ఒక్కసారిగా  మనీష్ శంకర్ వారిని చూసి స్పృహతప్పిపడిపోయాడు. అది గమనించిన సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అంతమంది అమ్మాయిలను ఒక్కసారి చూసేసరికే అలా స్పృహతప్పిపడిపోయాడని మనీష్ శంకర్ మేనత్త తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !