
మహ్మద్ ప్రవక్తపై ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ గ్రూప్ మార్కెట్లను మూసివేయాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రెండు గ్రూపులు శుక్రవారం ఘర్షణకు దిగాయి. ఓ వర్గం షట్‌డౌన్ పిలుపును మరొక వర్గం వ్యతిరేకించింది, ఇది రాళ్లదాడితో కూడిన ఘర్షణలకు దారితీసింది. గుంపును చెదరగొట్టడానికి, హింసను నిరోధించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించవలసి వచ్చింది.
మళ్లీ జమ్మూలో వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి.. ఇద్దరికి గాయాలు
బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఇటీవల జ్ఞానవాపి సమస్యపై వార్తా చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఆయన కామెంట్స్ ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు కారణం అయ్యింది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. ఈ ఘర్షణలపై ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. ఘర్షణల సమయంలో కాల్పులు వినిపించాయని, పెట్రోల్ బాంబులు కూడా ప్రయోగించారని వచ్చిన పుకార్లను మీనా తోసిపుచ్చారు. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే గాయపడినట్లు గుర్తించామని తెలిపారు.
‘‘ కొందరు 50-100 మంది యువకులు అకస్మాత్తుగా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. మరొక వర్గం దానిని వ్యతిరేకించడంతో అది రాళ్లదాడికి దారితీసింది. దాదాపు ఎనిమిది నుండి పది మంది పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు. వారు జోక్యం చేసుకోని పరిస్థితిని నియంత్రించారు. కొంత సమయం తరువాత కంట్రోల్ రూమ్‌కి మాచారం అందింది. దీంతో నాతో సహా సీనియర్ అధికారులు 10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నాం. హింసను ప్రేరేపించడానికి ప్రయత్నించిన వారిని తరిమికొట్టాం. సుమారు 15-20 మందిని అదుపులోకి తీసుకున్నాము. వారిపై విచారణ జరపుతున్నాం. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ’’ అని కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా పేర్కొన్నారు.
Satyendra Nath Bose : సత్యేంద్ర నాథ్ బోస్ కు డూడుల్ తో గూగుల్ నివాళి.. ఇంతకీ ఆయన ఎవరంటే ?
ఘర్షణల సమయంలో జర్నలిస్టులు చిత్రీకరించిన వీడియోలు గమనిస్తే రోడ్డుకు ఇరువైపులా గుంపులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం కనిపిస్తున్నాయి. మరో వీడియోలో పోలీసులు గుంపుపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడం కనిపించింది. ఓ గుంపు ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేస్తుంటే పోలీసులు కలుగజేసుకొని అతడిని తమ తీసుకెళ్లడం మూడో వీడియోలో ఉంది. హింసాకాండలో పాల్గొన్న వారిని ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ల సహాయంతో గుర్తిస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారని పీటీఐ పేర్కొంది.
శాంతిభద్రతలను కాపాడేందుకు 12 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టాబులరీ (పీఏసీ)ని ఆ ప్రాంతానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా అక్కడికి పంపుతున్నారు. ఘర్షణలు జరిగినప్పుడు ఘటనాస్థలికి 80 కిలోమీటర్ల దూరంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు ఓ కార్యక్రమంలో ఉన్నారు.
ఈ ఘర్షణపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. శాంతి భద్రతల కోసం విజ్ఞప్తి చేస్తూనే.. ఈ ఘర్షణలకు కారణమైన నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి నగరంలో ఉన్నప్పటికీ బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు పోలీసులు, నిఘా సంస్థల వైఫల్యంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయి. దీనికి కారణమైన వారిని అరెస్టు చేయాలి ’’ అంటూ ట్వీట్ చేశారు.