Ayodhya Verdict: మరికాసేపట్లో తీర్పు.. కోర్టుకు చేరుకున్న గొగోయ్

By telugu teamFirst Published Nov 9, 2019, 10:13 AM IST
Highlights

ఈ క్రమంలో గగోయ్ నేతృత్వంలోని ఐదుగురు బృందం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. కాగా... తీర్పు ఏ విధంగా ఉండబోతోందోనని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. తీర్పు ఎలా ఉన్నా... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.  ఇప్పటికే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జసిస్ట్ రంజన్ గొగోయ్... కోర్టులోకి అడుగుపెట్టారు. ఆయనతోపాటు మరో నలుగురు న్యాయమూర్తులు కూడా న్యాయ స్థానానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో గగోయ్ నేతృత్వంలోని ఐదుగురు బృందం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది. కాగా... తీర్పు ఏ విధంగా ఉండబోతోందోనని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. తీర్పు ఎలా ఉన్నా... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.

AlsoRead Ayodhya verdict:దేశవ్యాప్తంగా హై అలర్ట్.. భారీ భద్రత నడుమ సుప్రీం...

ఇప్పటికే సుప్రీం కోర్టు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.అయోధ్య కేసు తీర్పును వెలువరించే అవకాశాలు ఉండటంతో ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), స్థానిక నిఘా బృందాల ఉన్నతాధికారులు సహా పలువురు అయోధ్యలో భద్రత చర్యలు చేపడుతున్నారని ఓ అధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరైనా ద్వేషపూరిత సందేశాలు వ్యాప్తిచేస్తున్నారా అనే విషయంపై కూడా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అయోధ్యలో గతనెల 14 నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్.. వచ్చేనెల 10 వరకు కొనసాగనుంది.

ఇదిలా ఉండగా.... ఈ తీర్పు విషయమై ప్రధాని మోదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుందని ఆయన చెప్పారు. ఆ తీర్పు ఒకరి విజయం కాదని..  అలా అని ఓటమీ కూడా కాదన్నారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

దేశ ప్రజలంతా శాంతి, ఐక్యత, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ  పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలిసి మెలసి నిలబడాలని పిలుపునిచ్చారు.


 

click me!