Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

Published : Nov 09, 2019, 09:36 AM ISTUpdated : Nov 09, 2019, 09:43 AM IST
Ayodhya Verdict: ఢిల్లీలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మకాం!

సారాంశం

అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశం అంతా హై అలెర్ట్ కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు తదనంతర పరిణామాలను చర్చించడానికి పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై వివిధ నేతలతో చర్చించనున్నారు. 

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు సందర్భంగా హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు బీజేపీ నేతలతో మంతనాలు జరపనున్నారు. 

ఇదిలా ఉండగా, శనివారం ఉదయం బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో అయోధ్య కేసులో సుప్రీం తీర్పు తదనంతర పరిణామాలపై అమిత్‌ షా సమాలోచనలు జరుపనున్నట్టు తెలుస్తుంది. 

Also read: నేడే అయోధ్య తీర్పు... ఇది ఎవరి విజయం కాదు.. ప్రధాని మోదీ

పార్టీ తదుపరి కార్యాచరణ పై అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ లు నేటి సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు  సమాచారం. ఇక దశాబ్ధాల తరబడి రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమి వివాదం కేసుపై సుప్రీం కోర్టు శనివారం ఉదయం 10.30 గంటలకు చారిత్రక తీర్పును వెలువరించనున్నట్టు నిన్న రాత్రి తెలిపింది. 

తీర్పుపై ప్రజలంతా సంయమనం పాటించాలని మోడీ సహా అందరు నేతలు విజ్ఞప్తి చేసారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఇదేవిషయాన్ని తెలిపారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. 

స్వాతంత్య్రానంతరం మొదలైన వివాదంలో మొదటి కోర్టు కేసు నమోదైన డెబ్బై సంవత్సరాల తరువాత, ఈ రోజు బాబ్రీ మసీదు-రామ్ జన్మభూమి భూ వివాదంలో సుప్రీంకోర్టు నేడు తన తీర్పు వెలువరించింది. దశాబ్దాలుగా దేశ రాజకీయ చర్చను  ప్రభావితం చేసిన ఈ వివాదం అనేక మలుపులు తిరిగి, వివిధ కోర్టు మెట్లెక్కింది. 

Also read: Ayodhya Verdict... అయోధ్య తీర్పు... ఈ రోజే ఎందుకు..?

ఉత్తర ప్రదేశ్, అయోధ్యలో  ఉన్న ఒక పురాతన మసీదును 1992 లో హిందూ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ప్రదేశం రాముడి జన్మస్థలం అని నమ్ముతారు. ఈ పరిస్థితుల తదనంతరం చెలరేగిన అల్లర్లలో దాదాపుగా 2,000 మంది మరణించారు. ఈ భూమి ఎవరికీ చెందుతుందనే దానిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరించనుంది. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం