2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఐశ్వర్యకు సివిల్స్ లో 93వ ర్యాంక్

Published : Aug 07, 2020, 11:06 AM ISTUpdated : Aug 07, 2020, 11:09 AM IST
2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఐశ్వర్యకు సివిల్స్ లో 93వ ర్యాంక్

సారాంశం

2019 యూపీఎస్‌సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 4వ తేదీన ప్రకటించిన తర్వాత ఐశ్వర్య షియోరన్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షించింది.

న్యూఢిల్లీ:2019 యూపీఎస్‌సీ పరీక్షా ఫలితాలను ఈ నెల 4వ తేదీన ప్రకటించిన తర్వాత ఐశ్వర్య షియోరన్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఐశ్వర్య షియోరన్ 2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్. అంతేకాదు ఆమె సివిల్స్ లో 93వ ర్యాంకు సాధించింది. ఆమె కొంత కాలం క్రితం మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆ సమయంలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ఆమెను కోరారు. ఆమె ఈ పోటీల్లో పాల్గొంది.

also read:2019 సివిల్స్ ఫలితాల విడుదల: తెలంగాణ వాసి మకరంద్‌కు 110వ ర్యాంక్

 ఫెమినా మిస్ ఇండియా 2016 ఫైనలిస్టులో స్థానం సంపాదించిన ఐశ్వర్య షియోరన్ సివిల్స్ లో 93 ర్యాంకు సాధించినందుకు తమకు గర్వకారణమని మిస్ ఇండియా అధికారిక ట్విట్టర్ పేజీ ప్రకటించింది. సివిల్స్ లో ర్యాంకు సాధించిన ఆమెకు తమ అభినందనలు అంటూ ప్రకటించింది.

సివిల్స్ పరీక్షలకు హాజరు కావడం ఐశ్యర్య కలగా చెబుతారు.  ఆమె తండ్రి ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తున్నారు. ఆమె రాజస్థాన్ లో పుట్టింది. ఉన్నత విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం