24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 20,27,075కి చేరిక

By narsimha lode  |  First Published Aug 7, 2020, 10:36 AM IST

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే  62,538 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20,27,075కి చేరుకొంది.


న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే  62,538 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 20,27,075కి చేరుకొంది.

దేశంలో  యాక్టివ్ కేసులు 6,07,384 ఉన్నాయి. మరో వైపు కరోనా సోకిన వారిలో 13,78,106 మంది రికవరీయ్యారు.కరోనాతో 41,585 మంది ఇప్పటివరకు మరణించారు.
దేశంలో ఈ ఏడాది జూలై 31వ తేదీన అత్యధికంగా 57,151 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాత నిన్న నమోదైన కేసులే అత్యధికం. నిన్న ఒక్క రోజే 50 వేల మంది కరోనా నుండి కోలుకొన్నారు.

Latest Videos

undefined

గత 9 రోజుల వ్యవధిలో దేశంలో కొత్తగా ఐదు లక్షల కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి 21 రోజుల సమయం పడుతోంది.
దేశంలో గత 24 గంటల వ్యవధిలో 886 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాతో మరణించిన వారి సంఖ్య 2.07గా నమోదైంది.

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనాతో మరణించే వారి సంఖ్య కూడ పెరిగిపోతోంది. మహారాష్ట్రలో  నిన్న ఒక్క రోజే 300 మంది మరణించారు. అంతేకాదు కొత్తగా 11,500 కేసులు రికార్డయ్యాయి.


 

click me!