కరోనా ఎఫెక్ట్: ఈ నెల 27వరకు సివిల్ ఏవియేషన్ ఆఫీస్ మూసివేత

By narsimha lode  |  First Published Apr 22, 2020, 1:20 PM IST

సివిల్ ఏవియేషన్ భవనాన్ని ఈ నెల 27వ  తేదీ వరకు మూసివేయనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ కావడంతో  అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.


న్యూఢిల్లీ: సివిల్ ఏవియేషన్ భవనాన్ని ఈ నెల 27వ  తేదీ వరకు మూసివేయనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టుగా నిర్ధారణ కావడంతో  అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

సివిల్ ఏవియేషన్ భవనంలో పనిచేసే ఉద్యోగికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా ఈ కార్యాలయాన్ని మూసివేశారు. 

Latest Videos

దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇతర విషయాలను చర్చించేందుకు గాను కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశమైంది. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

also read:వైద్యులకు అండగా ఉంటాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

దేశంలో ఇప్పటివరకు 19,984 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 15,474 యాక్టివ్ కేసులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ సోకిన వారిలో 3,869 ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారిలో 640 మంది మృత్యువాత పడ్డారు.

మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్  కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మంగళవారం నాడు మహారాష్ట్రలో  కేంద్ర బృందం పర్యటించింది. 
 

click me!